ఎంఈఓ నాగయ్య
బోధన్ ఆగస్టు 31 ద్రోణ
ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందుతున్న పరుచూరి నగేష్ బాబు నేటి ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయుడని బోధన్ మండల ఎంఈఓ నాగయ్య అన్నారు.ఆదివారం బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జేసి) గణిత ఉపాధ్యాయులు పరుచూరి నగేష్ బాబు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగేష్ బాబు పనిపట్ల నిబద్ధతగల వ్యక్తీ అని, క్రమశిక్షణకు మారుపేరని పేర్కొన్నారు. ఏనాడు కూడా ఆయన సమయపాలన విస్మరించకుండా విధులకు ఖచ్చితంగా హాజరయ్యేవారని అన్నారు. విద్యార్థులకు సులభమైన రీతిలో గణితం బోధించడమే కాకుండా ఉపాధ్యాయుల సమస్యలపై కూడా అదే స్థాయిలో ఆయన పరిష్కరించిన ఘనత ఉందని అన్నారు. ఆయన క్రమశిక్షణ నేటితరం ఉపాధ్యాయులకు ఆదర్శం కావాలని అన్నారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు పూదోట రవికిరణ్, మాజీ డిసిసిబి డైరెక్టర్ గంగారెడ్డి నగేష్ బాబు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జేసీ హైస్కూల్ హెచ్ఎం బాలచంద్రం, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్ కుమార్, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు ఎంబెల్లి శంకర్, మోహన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబిరెడ్డి, ఉపాధ్యాయులు శ్రీకృష్ణ, జేఏసీ గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.














