Sunday, September 27, 2026

సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది

అంతిమయాత్రలో పాడేమోసిన పోచారం ,సీపీ

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి , ప్రభుత్వ సలహా దారులు, బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు, సిపి సాయి చైతన్య, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో , నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమి రెడ్డి అంతే మా యాత్రలో పాల్గొన్నారు.బాన్సువాడ నియోజకవర్గం, మోస్రా మండల కేంద్రానికి చెందిన సౌమ్య తల్లిదండ్రులు గాజుల సాయిలు – చంద్రకళను ఓదార్చి వారిలో మనోధైర్యాన్ని నింపి అంతిమ యాత్రలో పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోచారం మాట్లాడుతూ గత నెల జనవరి 23వ తేదీన రాత్రి మాధవనగర్ వద్ద విధి నిర్వహణలో ఉన్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను గంజాయి ముఠా కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ సౌమ్య హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో 9 రోజులు మృత్యువుతో పోరాడి చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు అన్నారు.
విధి నిర్వహణలో అసాధారణ తెగువ ప్రదర్శించి అసువులు బాసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సౌమ్య కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు మరియు సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం, సౌమ్య సర్వీస్ కాలానికి ప్రభుత్వ వేతనం చెల్లిస్తాం అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారని, తమ సహ ఉద్యోగిని సౌమ్య కుటుంబానికి అండగా ఒక్క రోజు వేతనాన్ని అందజేస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది నిర్ణయం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోస్రా మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, మోస్రా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular