Thursday, February 12, 2026

పంట నష్టపరిహారాన్ని చెల్లించాలని బిజెపి డిమాండ్

కలెక్టర్ కు వినతి

వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగానికి, భారీ వర్షాలకు కుప్పకూలిన ఇళ్ల బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించాలని బోధన్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. సోమవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిజాంబాద్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజీరా ముంపు గ్రామంలో అయినా రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బోధన్ మండలంలోని హంగార్గా, కోపర్గా, మందర్న, హంస మరియు ఖాజాపూర్ రైతాంగం వరద ముంపు గురై పంటలను తీవ్రంగా రైతులు నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టాన్ని కళ్ళతో చూస్తుంటే చూసినవారకే కన్నీళ్లు కారుతున్నాయని, పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్న రైతన్నల పరిస్థితి దీనంగా ఉందని ఆయన అన్నారు. పంటలు నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 30000 చెల్లించాలని, వర్షానికి కుప్పకూలిన ఇండ్ల మరమ్మతుకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలని బిజెపి నాయకులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. అన్నం పెట్టే రైతన్నలు కన్నీరు కారిస్తే మంచిది కాదని, ప్రభుత్వం వెంటనే స్పందించి పంటల పరిశీలనను జరిపి నష్టపరిహారాన్ని అందించి తీరాలని వడ్డీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ అధ్యక్షులు గోపి కిషన్, బోధన్ మండల అధ్యక్షులు శిల్ప సుదర్శన్, శ్రీధర్, రావుబాగంగాధర్, సాగర్ గౌడ్, శివ ముప్పు, విజయ్, గౌతమ్, మనోహర్, యోగేష్, ప్రవీణ్ మరియు రాజేంద్ర గౌడ్ తో పాటు పలువురు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular