Thursday, February 12, 2026

అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలు ఆగవు

సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు

శాంతియుతంగా ప్రతి ఒక్కరు తమ డిమాండ్లను ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లాల్సిన హక్కు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అక్రమంగా ఉద్యోగులను అరెస్టు చేయడం వలన ప్రజా ఉద్యమాలను ఆపడం ఎవరి తరం కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు హెచ్చరించారు.అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా మంత్రులకు విన్నవించుకుందామని రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపును జయప్రదం చేయటం కోసం అంగన్వాడీ ఉద్యోగులు సన్నద్ధమైన సందర్భంలో ఉద్యమాన్ని అణచివేసేందుకు నిన్న రాత్రి నుండే సిఐటియు నాయకులను, అంగన్వాడీ నాయకులను కార్యకర్తలను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్భందించటాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు తీవ్రంగా ఖండించారు. నిర్బంధం ద్వారా ఉద్యమాన్ని అణచాలనుకోవటం అవివేకమని గత ప్రభుత్వాలు ఇదే పద్ధతుల్లో ఉద్యమాలను పోలీసుల ద్వారా అనుచాలని చూసి ఏ రకంగా ప్రజా తిరస్కారానికి గురయ్యారు అందరికీ తెలిసిందే అని. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే పద్ధతుల్లో ఆలోచించటం సరైంది కాదని తెలిపారు. ఒకవైపు ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్తూనే మరొకవైపు ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడకుండా పోలీసుల చేత బలవంతంగా అరెస్టులు చేయటం ఏ విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ అవుతుందో ఆలోచించాలని అన్నారు. ఉదయం నాలుగు గంటల నుండి తనను గృహ నిర్బంధంలో ఉంచటంతో పాటు , బోధన్ సిఐటియు నాయకులు శంకర్ గౌడ్ మరియు గంగాధర్, నవీపేట్ లో సిఐటియు నాయకులు నాయక్ వాడి శ్రీనివాస్, జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్లను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్భందించారు. అదేవిధంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కైది దేవగంగు జిల్లా నాయకులు మంగాదేవి, గోదావరి, కరుణ, లక్ష్మీ తదితరులతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అంగన్వాడీ టీచర్లను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారని తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన ధోరణిని మార్చుకొని అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు జరపాలని. వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆయన అన్నారు. లేనియెడల వారి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular