Thursday, February 12, 2026

ఏపీ మహిళల ఆర్థిక సాధికారత

మహిళల అభివృద్ధి బాబు లక్ష్యం

మహిళా అభివృద్ధికి దేశానికి ఏపి రోల్ మోడల్ గా నిలుస్తుందని భావిస్తున్నా

మహిళల విద్య, ఆరోగ్యం, వ్యాపారారంగం మరియు డిజిటల్ చేర్పు కోసం “తిరుపతి పార్లమెంటరీ మరియు శాసనసభ కమిటీ తొలి మహిళా జాతీయ సదస్సు తీర్మానం” ఆమోదం ఒక చరిత్రాత్మకం.

పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర అసెంబ్లీలో అద్భుత ప్రసంగాలపై సోషల్ మీడియాలో చూసి ప్రత్యేకంగా అభినందించిన కేరళ మహిళా ప్రజాప్రతినిధులు

తిరుపతిలో జరిగిన తొలి పార్లమెంటరీ మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సులో పుట్టపర్తి

నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి వెల్లడి.

పుట్టపర్తి : సెప్టెంబర్ 15, ద్రోణ

మహిళా సాధికారత లో ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దేశంలోనే రాష్ట్రం ఎంతో ముందంజలో ఉందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు.
తిరుపతిలో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ పార్లమెంటరీ మరియు శాసనసభ కమిటీల తొలి జాతీయ సదస్సులో సోమవారం ముగింపు సదస్సులో పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి అక్కడికి విచ్చేసిన మీడియాతో మాట్లాడారు. మహిళా సాధికారతలో రాజకీయ ఆర్థిక సామాజిక విద్య వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికి రోల్ మోడల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలుపుతారని విశ్వాసం నమ్మకం తమకు ఉందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అన్నారు. మహిళల సాధికారత కోసం స్థిరమైన ఆర్థిక సాధికారత ఎంతో అవసరం అన్నారు. ఈ సందర్భంగా “తిరుపతి తీర్మానం” ఆమోదించబడిందని చరిత్రలో ఈ జాతీయ సదస్సు ఇది మైలురాయిగా నిలిచిపోతుందని తెలిపారు.ఎంతో
చారిత్రాత్మకంగా మహిళా సాధికారతకు అంకితమైన మహిళల సాధికారత అనేది కేవలం సామాజిక అవసరం మాత్రమే కాకుండా ఆర్థిక అవసరమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఏపీలో మహిళల ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలు, వ్యాపారా రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ట్రంలో అపారమైన మానవ వనరులను వెలికి తీయగలదని, బలమైన సామాజిక-ఆర్థిక అభివృద్ధి నమూనాను కూటమి ప్రభుత్వం నిర్మించగలదని భావిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం పలు రాష్ట్రాల మహిళా ప్రజాప్రతినిధులతో ఆ రాష్ట్రాల్లో మహిళలకు అమలవుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా కేరళ రాష్ట్ర మహిళా ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా ఈ విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేరళలో విద్యాభ్యాసం చేసి అక్కడే పుట్టి పెరిగి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న పల్లె సింధూర రెడ్డిని వారు ప్రత్యేకంగా అభినందించారు. పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల సమస్యల పైనే కాకుండా అనేక అంశాలపై అసెంబ్లీలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అద్భుతంగా మాట్లాడిన అంశాలను సోషియల్ మీడియా ద్వారా చూసామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరను కేరళ మహిళా ప్రజాప్రతినిధులు ప్రశంసిస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular