Thursday, February 12, 2026

విద్యార్థుల వినూత్న నిరసన

బోధన్ సెప్టెంబర్ 15 ద్రోణ

తమ గ్రామానికి రవాణా సౌకర్యం నిలిచిపోయిందని పడరాని పాట్లు పడుతున్నామని వెంటనే మరమ్మతులు చేపట్టాలని వినూత్న రీతిలో విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేశారు.
బోధన్ మండలం ఖండ్‌గాం గ్రామ యువకులు విన్నుత రీతిలో నిరసన తెలుపుతూ వెంటనే రోడ్డు సదుపాయం కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. గ్రామ యువకులు మీసాలె నాగేష్ మాట్లాడుతు ఖండ్‌గాం నుండి కొప్పర్గ వెల్లే రోడ్డు మొత్తం కూడా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి, కావున వాహనదారులకు రాకపోకలకు తివ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు,గుంతల వల్ల ప్రమాధాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. అధికారులు ఎందుకు స్పందించడం లేదనీ
మండిపడ్డారు .ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు కు మరమత్తులు చెపట్టాలని అయన అన్నారు. లేని పక్షం లో ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు మరియు యువకులు, వీరేష్ ,రాజు ,సాయిలు,ప్రసాద్ ,సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular