నిజామాబాద్ ప్రతినిధి సెప్టెంబర్ 15 ద్రోణ
బాధితులకు రక్షణ కల్పించడంతోపాటు, బాధితులకు శిక్ష పడకుండా చూడటమే పోలీసుల లక్ష్యమని నిజామాబాద్ సిపి సాయి చైతన్య స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో బాధితులకు అండగా నిలుస్తూ పోలీసులపై మరింత నమ్మకాన్ని పెంచిన ఘనత సిపికి దక్కింది. గతంలో బాధితులు ఉన్నత పోలీసు అధికారుల వద్దకు వెళ్లాలంటేనే జంకె వారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ సమస్యలు స్థానికంగా పరిష్కారం కాకపోతే పోలీస్ బాస్ వద్దకు వెళ్లి న్యాయం పొందవచ్చు అన్న నమ్మకాన్ని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. బాధితులు సిపిని ఆశ్రయించిన వారికి వెంటనే న్యాయం చేయడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించడంలో తన ప్రత్యేకముద్రను సిపి వేసుకున్నారు.ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాది దారుల నుండి 23 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్.
సోమవారం నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల యొక్క ఎస్.ఐ మరియు సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది.
ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని తెలియజేశారు.










