Thursday, February 12, 2026

ముమ్మాటికి విద్రోహ దినమే

సెప్టెంబర్ 17 విలీనము కాదు విమోచన కాదు ముమ్మాటికి విద్రోహదిరమేనని సి.పి.ఐ (ఎం-ఎల్) ప్రజాపంథా బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి మల్లేష్ ఆరోపించారు.
మంగళవారం బోధన్ పట్టణంలోని తాలూకా రైస్ మిల్ అసోసియేషన్ భవన్ లో బోధన్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మల్లేష్ మాట్లాడుతూ నాడు నైజాము నిరంకుశ పాలన క్రింద ప్రజలు అనేక బాధలకు, ఇబ్బందులకు, హింసలకు గురయ్యారని ఇక్కడ నిరంకుశ,ఫ్యూడల్ ప్రభుత్వం దారుణమైన అణచివేతను అమలు చేసిందని, ఎలాంటి పౌర,ప్రజాతంత్ర హక్కులు లేకుండేనని గ్రామీణ ప్రజలు ముఖ్యంగా దళిత వెనుకబడిన వర్గాల వారు నిజాం ప్రభుత్వ అధికారుల ముందు భూస్వాముల ముందు పటేల్ పట్వారిల ముందు తమను తాము కించపరుచుకుంటూ, నీచ పరుచుకుంటూ సంబోధించుకునే స్థితికి తెలంగాణ ప్రజలు తమ వ్యక్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని ఈ విధంగా కోల్పోయారని వివరించారు.
నిజాం పాలనలో అనేక దొంతరాల భూస్వాములు ఉండేవారని భూస్వాములను దేశ్ ముఖ్ లు, దేశ్ పాండ్యాలు, జాగిర్దారులు అని పిలిచేవారని వీరు నిజాం నవాబుకు నియమిత పన్నును చెల్లించి ప్రజల దగ్గర నుండి వారి ఇష్టమొచ్చినంత మొత్తాన్ని పన్నుగా వసూలు చేస్తుండే వారని, తెలంగాణలో10వేల గ్రామాలలో 2,600 వరకు జాగీరు గ్రామాలుగా ఉండేవని, మిగతా గ్రామాలు నైజాము ప్రత్యక్ష పరిపాలన కింద ఉండేవని వీటిని ఖా ల్సా అనేవారు 646 గ్రామాలు నిజాం కుటుంబ ఖర్చులకోసం కేటాయించబడ్డాయని ఈ ప్రాంతాన్ని సర్ఫే కాస్ అని పిలిచేవారని ఈ గ్రామాల నుండి వచ్చిన ఆదాయమంతా నిజాం కుటుంబానికి పోయేదని రాష్ట్ర ఆదాయం నుండి సంవత్సరానికి రెండు కోట్లు నిజాం కుటుంబ ఖర్చులకు చెల్లించబడేదని వివరించారు. విసునూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డికి 40 వేల ఎకరాల భూమి, సూర్యపేట దేశ్ ముఖ్ కు 20వేల ఎకరాలు, బాబా సాహెబ్ పేట దేశ్ ముఖ్ కు 10 వేల ఎకరాలు, కల్లూరు దేశ్ ముఖ్ కు లక్ష ఎకరాల భూమి, జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి లక్ష 50 వేల ఎకరాల భూమి, 5వేల ఎకరాలు కు పైగా భూమి కలిగిన భూస్వాములు ఇంకా చాలామంది ఉండేవారని 500 ఎకరాలకు పైగా భూమి కలిగిన భూస్వాములు 550 మంది ఉండేవారని 1951 నాటి ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని, నిజాము ప్రత్యక్ష పాలన ప్రాంతంలో కన్నా జాగీరులలో దోపిడీ, అణచివేతలు ఎక్కువగా ఉండేవని వీటికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ప్రజలందరూ సంఘటితమై అనేక పోరాటాలను చేసి 3వేల గ్రామాలలో పది లక్షల ఎకరాల భూస్వాముల భూములను ప్రజలు పంపిణీ చేసుకున్నారని (*దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇన్ని లక్షల ఎకరాల భూమిని పాలకులు పంపిణీ చేయలేదు.) అయితే ఇక్కడ జరుగుతున్న తెలంగాణ పోరాటాన్ని చూసిన నాటి ప్రధాని నెహ్రూ,హోమ్ మంత్రి పటేల్ లు ఇది ఇట్లాగే కొనసాగితే భారతదేశంలోని దేశ్ ముఖ్ లు, దేశాయి లు, భూస్వాముల భూములన్నింటినీ పేద ప్రజలందరూ హస్త గతం చేసుకుంటారని భయంతో నైజాముతో లోపాయికారిగా మాట్లాడి 1948 సెప్టెంబర్ 17న భారతదేశ సైన్యానికి నైజాము లొంగిపోయినట్లుగా ప్రకటించారని, కుట్రపూరితంగా వ్యవహరించారని. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన సైన్యాలు తెలంగాణలోని కమ్యూనిస్టు నాయకులపై కార్యకర్తలపై ప్రజలపై పాశ వికమైన దాడులను కొనసాగించి 4వేల మందిని పొట్టన పెట్టుకున్నారని, అనేకమంది జై ళ్లలో నిర్బంధించబడ్డారని , పోరాటాలు చేసి సాధించుకున్న 3వేల గ్రామాలలోని 10 లక్షల ఎకరాల భూములను తిరిగి భూస్వాములకే అప్ప చెప్పారని నిరంకుశ నైజామును దేశ్ ప్రముఖ్ గా బిరుదునిచ్చి గౌరవించారని అందుకే సెప్టెంబర్ 17 విద్రోహ దినమన్నారుఈ కార్యక్రమంలో పట్టణ నాయకురాలు బీపాషా బేగం, పోశెట్టి, నాగేశ్వర్, బి ఓ సి నాయకులు జి. గౌతమ్, సలీం, కాజా, శంకర్, యాదమ్మ, లక్ష్మి, పద్మ మరియు వివిధ ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular