ఇంజనీర్స్ నేను పురస్కరించుకొని బోధన్ పట్టణంలోని పలువురు ఇంజనీర్లను లైన్స్ క్లబ్ బృందం ఘనంగా సన్మానించారు.
బోధన్ పట్టణంలోని రైస్ మిల్ అసోసియేషన్ హాల్లో సోమవారం రాత్రి జరిగిన ఇంజనీర్స్ డే ఉత్సవాలను లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచనపల్లి ఆధ్వర్యంలో నిర్వహించారు.విద్యుత్తు శాఖ డివిజనల్ ఇంజనీర్ ముక్తార్, మునిసిపల్ డిప్యూటీ ఇంజనీర్ ఏ మహేష్ లను గాంధీ యంగ్ సైంటిస్ట్ (గాంధీ యంగ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అవార్డ్ హ 2023) అవార్డ్ గ్రహీత సాయి అమిత్, విద్యుత్తు శాఖ ఇంజనీర్ నాయిని కృష్ణ, శ్రీ అసోసియేట్ ఇంజనీర్ కర్నే శ్రీనివాస్ లను పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డివిజనల్ ఇంజనీర్ ముక్తార్, మాట్లాడుతూ ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుని పుట్టిన ప్రాంతంలోనే ఇంజనీర్ గా సేవలందించటం తనకు దొరికిన అరుదైన అవకాశం అని అన్నారు. వరదలు వచ్చినప్పుడు రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ సంవత్సరం ట్రాన్స్ఫార్మర్ లను ఉన్నతాధికారుల సహకారంతో త్వరగా తీసుకు వచ్చేందుకు కృషి చేశామని, ఇది నా కెరీర్లో చాలా గుర్తుండిపోయే విషయం అని గుర్తు చేశారు. రాబోయే తరాలకు ఏమి కావాలో ఇంజనీర్ ఆలోచించి ఒక రకమైన డిజైన్ ని ఏర్పరుస్తారని, ఆ డిజైన్ ఏర్పరచడం వల్లే మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఇప్పటికీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గుర్తుంచుకుంటుందని అన్నారు. అప్పట్లో వచ్చిన మూసి వరదలకు ఆయన ఇచ్చిన డిజైన్ వల్లే హైదరాబాద్ లో మూసి పై రెండు డ్యాంలను నిర్మించడం జరిగిందని మున్సిపల్ ఏఈ మహేష్ విశ్వేశ్వరయ్యను కొనియాడారు. యువ ఇంజనీర్ సాయి అమిత్ మాట్లాడుతూ ఇంజనీర్ అంటే డబ్బు సంపాదన అనే ఉద్దేశంతో సమాజం చూస్తోందని, ఇంజనీర్లు దేశ సేవకు ఉపయోగపడతారనే ఆలోచనను వారిలో పెంపొందింప చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్ గా నాయిని కృష్ణ, కో చైర్మన్ గా కర్నే శ్రీనివాస్ లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కృష్ణమోహన్, లయన్స్ సభ్యులు సాంబిరెడ్డి, సత్యనారాయణ, శ్రీకాంత్, రమణారెడ్డి, తంసప్ రామకృష్ణ, శ్రీనివాసరాజు, హరిబాబు, ముళ్ళపూడి శ్రీనివాస్, గోపి, ముక్కామల వెంకటేశ్వరరావు, రాజబాబు, ఆదినారాయణ రెడ్డి, కెవిఎంకె ప్రసాద్, అంకు దామోదర్, ఐఆర్ చక్రవర్తి, కేవీ సత్యం, చదలవాడ వెంకటేశ్వరరావు చంద్రకాంత్ పటేల్, బర్డే ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఇంజనీర్లకు ఘన సన్మానం
RELATED ARTICLES
