Monday, March 30, 2026

సాయుధ పోరాట ఫలితమే పేదలకు వరం

నిజామాబాద్ ప్రతినిధి సెప్టెంబర్ 16 ద్రోణ

తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు మాత్రమే. చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదనీ సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు హెచ్చరించారు. తెలంగాణ రైతాంగ పోరాట విషయాలను ప్రజల్లోకి విస్తృతంగా వివరించే పనిలో భాగంగా సోమవారం ముబారక్ నగర్ లోని బీడీ కంపెనీలో కార్మికులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ నిజాం నవాబుకు తాబేదారులుగా ఉన్న దొరలు, భూస్వాములు పటేల్, పట్వారిలు జాకీర్దారులు, జమీందారులు పేదలతో తో వెట్టి చాకిరి చేయించుకుంటూ వారిపైన దౌర్జన్యాలను చేస్తూ విపరీతమైన పనులను మోపటంతో వాటిని సహించలేక ప్రజల్లో తిరుగుబాటు వచ్చి కమ్యూనిస్టుల నాయకత్వంలో సంఘాలను ఏర్పాటు చేసుకొని కుల ,మత ప్రాంతాలకు అతీతంగా దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 3 వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేశారు. 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన చరిత్ర కమ్యూనిస్టులది అని ఆయన అన్నారు. ఈ పోరాటంలో 2 వేల మంది వరకు దొరలు, రజాకార్ ల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. తరువాత పటేల్ సైన్యం దొరల కు వత్తాసు పలికారు దానికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో మరో 2500 మంది పేదలు, కమ్యూనిస్టు లు ప్రాణాలు కోల్పోయారు. అని ఇంతటి చరిత్ర కమ్యూనిస్టు లకు ఉంటే దాన్ని వక్రీకరణ చేస్తున్న బిజెపి విధానాలను ఎండ గట్టి ఈ పోరాటం కు కమ్యూనిస్టు లే వాదులని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నూర్జహాన్, కార్మిక నాయకులు సాయిలు, మోహన్, ఖాదర్, లక్ష్మి పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular