బోధన్ సెప్టెంబర్ 19 ద్రోణ
ఇందూర్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. విద్యతోపాటు అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఇందూరు పాఠశాల ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. పాఠశాల ప్రాంగణాన్ని పూవులు మరియు బతుకమ్మలతో అలంకరించి ,వివిధ రకాల పూలతో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందంగా బతుకమ్మలను పేర్చి, జానపద నృత్యాలతో అందరినీ అలరించారు. నవరాత్రుల సందర్భంగా విద్యార్థులు నవ దుర్గా మాతల వేషధారణలో మహిషాసురమర్ధిని నాట్యం ప్రదర్శించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విద్యావికాస్ కరెస్పాండెంట్ వై .శ్రీనివాస్ విద్యార్థులను అభినందించారు.వివేకానంద స్కూల్ కరెస్పాండెంట్ హరికృష్ణ , ఇందూర్ స్కూల్ కరెస్పాండెంట్ కొడాలి కిషోర్ హాజరై, విద్యార్థులకు బతుకమ్మ సంబరాల ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పావులూరి సుధారాణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.













