బి ఆర్ ఎస్ నాయకుల విజ్ఞప్తి
బోధన్ సెప్టెంబర్ 19 ద్రోణ
తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది వేలాది ఎకరాలు కబ్జాలు చేసిన పట్టించుకోని ప్రభుత్వాలు పేద ప్రజలు గుడిసెలు వేసుకున్న వారికి మాత్రం పట్టాలించేందుకు నిరాకరించడం పట్ల బోధన్ టిఆర్ఎస్ నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వంతో ఆలోచించి పేద ప్రజలు గుడిసెలు వేసుకున్న గుడిసెలు వేసుకున్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం పేదప్రజల సొంత స్థలం కల నెరవేరాలనే సంకల్పంతో ప్రభుత్వం ఒక జీవో 58,59 జారీ చేశారు. చాలా మంది పేద ప్రజలు దరఖాస్తులు చేయడంతో పాటు తమ దగ్గర ఉన్న దస్తవేజులు సంబంధిత అధికారులకు అందజేశారు. బోధన్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ స్ధలాల్లో గుడిసెలు మరియు షెడ్లు వేసికొని గత 20,30 సంవత్సరాలుగా నివాసం ఉంట్టున్న పేద కుటుంబాలకు మానవతా దృక్పథంతో వారికి పట్టాలు ఇప్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టు లకు గత ప్రభుత్వం ఇంటి స్థలాలు అందించారు. పట్టాలు ఇవ్వడంలో జాప్యం జరిగింది. స్థల పట్టాలు ఇవ్వలేదు వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, మరియు కొంతమంది ప్రెస్ వారికి ఇంటి స్థలాలు లభించలేదు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు వినతి పత్రంలో పొందుపరిచారు. బోధన్ పట్టణంకు ప్రత్యేకంగా ఉన్న 194 జీవోలో పట్టణలో గోసంగి బస్తీ రాకాసిపెట్, గాంధీ నగర్, ఆచంపల్లి, ఆటోనగర్ ఇతర వార్డులో ప్రజలకు రిజిస్ట్రేషన్ లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ భారతీయ రాష్ట్ర సమితి నాయకులు పెరక రామకృష్ణ,, నాగుల రవిశంకర్ గౌడ్,షైక్ మహమ్మద్,కొండం సాయిలు, తదితరులు పాల్గొన్నారు.
