వరంగల్ ప్రతినిధి సెప్టెంబర్ 22 ద్రోణ
సమ్మక్క సారమ్మల జాతర సందర్భంగా ముఖ్యమంత్రి ఆలయాన్ని సందర్శించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణతో ఘన స్వాగతం పలికారు.
హెలికాప్టర్ ద్వారా గద్దెల ప్రాంతానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వాగతం పలికారు.
తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని శ్రీ సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద మంగళవారం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి తో కలసి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం,మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గద్దెల ప్రాంతానికి చేరుకున్న వారికి ఆలయ అధికారులు, మేడారం పూజారులు సాంప్రదాయ నృత్యాలు, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మేడారం గద్దెల ప్రాంగణాన్ని ఆధునికరించే డిజిటల్ మ్యాప్ ను విడుదల చేసారు. జాతర నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరిష్ తదితరులు పాల్గొన్నారు.








