Thursday, February 12, 2026

అక్టోబర్ మొదటి వారంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు

తెరపైకి బోనస్

నిజామాబాద్ ప్రతినిధి సెప్టెంబర్ 22 ద్రోణ

ఖరీఫ్ సీజన్లో వరి పంటను సాగుచేసిన రైతులకు ఊరట పొందే నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోనే బాన్సువాడ నియోజకవర్గంలో ఖరీఫ్ వరినట్లు ముందస్తుగా నాటుకున్నారు. దసరా పండుగ నాటికి ఈ ప్రాంతంలోని వరి ధాన్యం చేతికందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి ఏడాది అక్టోబర్ 15 తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. బాన్సువాడ నియోజకవర్గంలో ముందస్తుగా ప్రతి ఏడాది ధాన్యం చేతికంతుంది. దాన్యం చేతికి అందిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతన్నలు పండించిన ధాన్యం దళారుల పాలు అవుతుంది. ఈ విషయాన్ని బాన్సువాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారులుగా కొనసాగుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత అధికారులు ఇప్పటికే తమ ప్రాంతంలో పంటలను పరిశీలించారు. బాన్సువాడ నియోజకవర్గం ప్రాంతంలో వరి ధాన్యం ఈ నెలాఖరుకు కొంతమేరకు చేతికందుతుంది. ఈ విషయాన్ని ఈ ప్రాంతాన్ని పరిశీలించిన అధికార బృందం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముందస్తుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ముందస్తుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు త్వరగా ప్రారంభిస్తే రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా అమ్మకాలు చేపట్టుకొని మద్దతు ధర పొందే అవకాశం కలుగుతుంది. గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడంతో ముందస్తుగా ధాన్యం చేతి కందిన రైతులు ధాన్యాన్ని నిల్వ చేయలేక దళారులకు అమ్ముకొని పెద్ద మొత్తంలో రైతన్నలు నష్టపోయారు. గత ఏడాది కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొందరు ఈ ప్రాంతంలోని ధాన్యం కొనుగోలు చేసి చివరికి రైతులకు షట గోపం పెట్టారు. ఈ ప్రాంతానికి చెందిన రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని కోట్లాది రూపాయల నష్టాలను చవిచూశారు. ధాన్యం అమ్ముకున్న రైతులు కర్ణాటక ప్రాంతానికి వెళ్లి కొనుగోలు చేసిన వారిని నిలదీసినప్పటికీ లాభం లేకపోయింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం దాన్యం కొనుగోలు కేంద్రాలను ముందస్తుగానే ప్రారంభించాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి తన శక్తికి మించిన కృషి చేస్తున్నారు. ప్రతినిత్యం రైతు చేస్తున్న కష్టానికి తగిన ఫలితం అందించడమే తన లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోనే బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంతో పాటు, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో తెలంగాణ రాష్ట్రంలోనే బాన్సువాడ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. రాబోయే ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే అమ్మకాలు చేపట్టుకొని మద్దతు ధరతో పాటు డబ్బు కూడా సకాలంలో పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే రైతులకు పిలుపునిచ్చారు.

క్వింటాలుకు 500 బోనస్

ఆరుగాలం కష్టించి పనిచేసే పంటలను పండించిన రైతన్నలకు కష్టాన్ని తగ్గ ఫలితం లభించడం లేదన్న దృక్పథంతో రైతులు పండించిన వరి ధాన్యానికి మరింత డబ్బు రైతులకు అందించాలన్న దృడ సంకల్పంతో ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణాలను కొంతమేరకు మాఫీ చేశారు. మరికొంతమంది రైతుల రుణాలు మాఫీ చేయకపోవడంతో కొంతమంది రైతులు ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం పండించిన రైతన్నలకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ రూపేనా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. రబీ సీజన్లో వరి ధాన్యాన్ని పండించిన రైతన్నలకు బోనస్ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. మరోపక్క ప్రభుత్వం బోనస్పట్ల స్పష్టమైన ప్రకటన చేయకపోవడం రైతులను అయోమయానికి గురిచేస్తుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ధాన్యం త్వరలో చేతికంద పోతుంది. ఈ సందర్భంలో తిరిగి తెలంగాణ ముఖ్యమంత్రి బోనస్ విషయాన్ని తేర పైకి తీసుకువచ్చారు. బోనస్ పట్ల రైతులు కొంతమేరకు అయోమయానికి గురవుతున్నారు. గతంలో బోనస్ ప్రభుత్వం అందించడంతో వరి ధాన్యం పండించిన రైతులు ఎంత పెద్ద ఎత్తున లాభం పొందారు. ప్రస్తుత తరుణంలో బోనస్ వరి ధాన్యం పండించిన రైతులకు అందిస్తాం అనడం రైతన్నలకు ఊరట కలిగిస్తుంది. త్వరలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో ప్రజలకు సంక్షేమాలు, అభివృద్ధి పనులకు నిధులు అందించి ముందుకు వెళ్లే ప్రయత్నంలో ప్రభుత్వాలు ఉంటాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular