Thursday, February 12, 2026

గంజాయిని నిర్మూలించడంలో ప్రజల పాత్ర ఎంతో ముఖ్యం

జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్క పోలీసు అహర్నిశలు కష్టపడాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలియజేశారు. ప్రజలలో గంజాయి వల్ల కలుగు అనర్ధాలు, యువత, దేశ భవిష్యత్తు డ్రగ్స్ మాదక ద్రవ్యాల వల్ల నష్టపోతాయని విషయాన్ని ప్రజలకు అవగాహనతో కల్పించాలని సూచించారు. గంజాయి రహిత జిల్లాగా నిర్మించడానికి ప్రతి ఒక్కరి సహకారం ఎంతగానో అవసరం ఉంటుందని తెలియజేశారు. ముఖ్యంగా ప్రజలు గంజాయి కి దూరంగా ఉండాలని గంజాయి పండించిన, సేవించిన,వ్యాపారం చేసిన, వర్తకం చేసిన, వారిపై కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు. సాయంత్రం నార్నూర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ సిబ్బందిని ఉద్దేశించి పలు సూచనలు చేశారు. రానున్నది ఎన్నికల సమయం ప్రతి ఒక్కరూ పూర్తి సంసిద్ధమై ఉండాలని, గ్రామస్థాయిలో విపిఓ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, గ్రామాలలో జరుగు అసాంఘిక కార్యకలాపాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి సమాచారమైన క్షణాల వ్యవధిలో చేరుకునేలా సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరుచుకోవాలని గ్రామాలను సందర్శిస్తూ యువతకు చదువు పట్ల, భవిష్యత్తు పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ వెంటనే సమస్య పరిష్కారం దిశగా సిబ్బందిని కేటాయించి తగు పరిష్కారం చూపించాలని తెలియజేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా చూడాలని సూచించారు. దుర్గా నవరాత్రి ఉత్సవాలలో మండపాల వద్ద ఎలాంటి ఇవ్ టీజింగ్ జరగకుండా మహిళలకు అండగా ఉండాలని ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని తెలియజేయాలన్నారు. వాహనాల తనిఖీ నిర్వహిస్తూ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్, నార్నూర్ సీఐ పి ప్రభాకర్, ఎస్సై కె అఖిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular