Thursday, February 12, 2026

అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు

మహబూబ్ నగర్ ప్రతినిధి సెప్టెంబర్ 25 ద్రోణ

మహబూబ్ నగర్ నగరం
బాలుర జూనియర్ కళాశాల మైదానం ఆత్మీయత, ఆధ్యాత్మికత, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ వేడుకల్లోఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి యెన్నం ప్రసన్న లక్ష్మి ,మహిళలు, యువతులతో కలిసి బతుకమ్మ ఆడిన ఎంపి , ఎమ్మెల్యే సతీమణి , జిల్లా కలెక్టర్ ఉత్సాహంగా బతుకమ్మ ఆడి పాడిన మహిళలు, యువతులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి నృత్యాలు చేసిన మహిళలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు ఆత్మీయత, ఆధ్యాత్మికత, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాల్గవ రోజు బతుకమ్మ సంబరాలు మహబూబ్ నగర్ నగరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. బతుకమ్మ వేడుకలకు మహబూబ్ నగర్ ఎంపి డికె అరుణ , జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సాహంగా మహిళలు, యువతులు తీరొక్క పూలను పేర్చి బతుకమ్మ లను సిద్ధం చేసి ఈ వేదిక దగ్గకు తీసుకుని వచ్చి అందరూ కలిసి మెలిసి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషగా ఉందన్నారు. ఎంపి మాట్లాడుతూ మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కలిసిమెలిసి ఘనంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, సీనియర్ నాయకులు వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ,, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అవేజ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు అజ్మత్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నవనీత, కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ప్రశాంత్ , ఖాజా పాషా, రాషెద్ ఖాన్, చిన్న, మునీర్, జాజి మొగ్గ నర్సింహులు, నాయకులు అక్బర్, మోయీజ్, పీర్ మహ్మద్ సాదిక్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular