Thursday, February 12, 2026

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుకొందాం

కోటగిరి సెప్టెంబర్ 28 ద్రోణ

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు సత్తా చాటాలని ఏఐయుడబ్ల్యుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొడాలి సురేష్ పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన సాగిస్తోందని ఆయన అన్నారు.పేదలకు రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని కొడాలి సురేష్ అన్నారు.అవినీతి అక్రమాలకు చోటు లేకుండా అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వారికి సకాలంలో బిల్లులు చెల్లిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని సురేష్ అన్నారు.రైతులు పండించిన ధాన్యానికి 500 బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోందని.2 లక్షల రుణ మాఫీ చేసి రైతుల్ని రుణ విముక్తులని చేసిందని. వెనకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని,మహిళలకు ఉచిత బస్సు, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట ప్రభుత్వ పాఠశాలకు సౌకర్యాలని కల్పించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల్ని ప్రజలకువివరించి స్థానిక ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular