బాధిత కుటుంబాలకు 50 లక్షలు చొప్పున ఇవ్వాలని తెలంగాణ టిడిపి నాయకులు రాజేందర్ డిమాండ్
బోధన్ సెప్టెంబర్ 28 ద్రోణ
తమిళనాడు రాష్ట్రంలో
తొక్కిసలాట ఘటన పట్ల ఏత్తోండ రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 50 లక్షలు గాయాల పాలైన వారికి పది లక్షల చొప్పున ఇవ్వాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
నటుడు దళపతి విజయ్ మీటింగ్లో తొక్కిసలాట ఘటనపై టీడీపీ నిజామాబాదు పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏత్తోండ రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట వంటి సంఘటన గురించి తెలిసి తీవ్ర వేదనకు గురయ్యాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని సంతాపం తెలియజేస్తున్నాను, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’అని తెలిపారు.
