Thursday, February 12, 2026

శేట్కార్ పాడెను మోసేందుకు పోటీపడిన ప్రజాప్రతినిధులు

ప్రజా సేవకులుగా నిస్వార్థంగా అంకితభావంతో బిచ్కుంద ప్రాంత ప్రజలకు సేవలందించిన మల్లికార్జున్ అప్ప పరమపదించడంతో పాడెను పట్టేందుకు ప్రజా ప్రతినిధులు పార్టీలకతీతంగా పోటీ పడ్డారు.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, మాజీ ఎంపీ బిబి పాటిల్, వీరితో పాటు ఎంతోమంది నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.నిస్వార్థ సేవకు నిదర్శనం మల్లికార్జునప్ప, తుది శ్వాస విడవడంతో వారిపై ఉన్న ఆధార అభిమానాలను ఈ ప్రాంత ప్రజలు వెళ్ళు వెత్తారు.
జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో దశాబ్దాలుగా అంకితభావంతో సేవలందించిన సీనియర్ నాయకులు, బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన మల్లికార్జున్ అప్పా శేట్కార్ పరమపదించడం పార్టీకి, ప్రజలకు తీరని లోటు.
ఆయన ప్రజాసేవా తపన, పార్టీ పట్ల నిబద్ధత, నిజాయితీ, త్యాగం కాంగ్రెస్ చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచిపోతాయి. ఆయన కేవలం ఒక నాయకుడు కాదు శక్తి యుక్తులు గల నాయకులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజానాయకుడు.
అంత్యక్రియలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఎంపీ సురేష్ కుమార్, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ స్వయంగా మల్లికార్జున్ అప్పా పాడెను మోసి, చివరి యాత్రలో పాల్గొనడం ఆయన పట్ల ఉన్న గాఢమైన ప్రేమ, గౌరవానికి నిదర్శనం.
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ
“మల్లికార్జున్ అప్పా పార్టీకి, ప్రజలకు చేసిన సేవలు మరువలేనివి. ఆయన మరణం మా ప్రాంతానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు” అని సంతాపం వ్యక్తం చేశారు.
అలాగే మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్భా వోద్వేగంతో
“ఆయన నా రాజకీయ జీవితం లో మార్గదర్శకులు మాత్రమే కాకుండా మా కుటుంబానికి ఆప్త బంధువుల్లాంటి వారు. ఆయన చూపిన మార్గం ఎప్పటికీ నాకు ప్రేరణగా నిలుస్తుంది” అని తెలిపారు.
జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మల్లికార్జున్ అప్పా కి ఘనమైన నివాళులు అర్పించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular