Thursday, February 12, 2026

రైతుల సంక్షేమమే చంద్రన్న ధ్యేయం

కూటమి ప్రభుత్వం లో రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా

ప్రతి ఇంటిపై సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుతో విద్యుత్ ఆదా

వెంగలమ్మచెరువు లో రూ.4కోట్లతో నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి

పుట్టపర్తి ప్రతినిధి 06 ద్రోణ

రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువు గ్రామంలో సత్యసాయి జిల్లా విద్యుత్ శాఖ ఎస్ ఈ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎకరా స్థలంలో రూ.4 కోట్ల వ్యయంతో 33 / 11 నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి సోమవారం మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వంలో రైతుల సంక్షేమం కోసం నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా అందిస్తామని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు.నియోజకవర్గంలో ఎక్కడ లో వోల్టేజ్ సమస్య తలెత్తకుండా రైతుల సంక్షేమం కోసం అనేక విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యుత్తును ఆదా చేయాలని దీనివల్ల రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఇంటిపైన సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తోందని తెలిపారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో కనీసం ఒక విద్యుత్ బల్బ్ కూడా వేయలేకపోయారని వైసీపీ పార్టీని విమర్శించారు. మన భవిష్యత్తు తరాలకు సూర్య ఘర్ ఎంతో ప్రయోజనం ఉంటుందని దీనివల్ల ఇంధనం ఆదా అవుతుందని పేర్కొన్నారు. సోలార్ రాకతో 2027 నాటికి 50% కాలుష్య రహిత ప్రాంతాలుగా 2047 నాటికి కాలుష్య రహిత భారత్ గా వర్ధిల్లుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటిపై సూర్య ఘర్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వ రాయితీ సౌకర్యం కల్పిస్తుందని ఇందుకు బ్యాంకు రుణం కూడా అందజేస్తారని ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రైతుల కు నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తామని పేర్కొన్నారు. వెంగళమ్మ చెరువు గ్రామంలో లో వోల్టేజ్ సమస్యతో ఇక్కడ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని సుమారు 5000 కనెక్షన్లు , రెండువేల రైతుల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయనీ తెలిపారు. ఈ లోవోల్టేజి సమస్యను పరిష్కరించడానికి ఈ నూతన సబ్ స్టేషన్ మంజూరు చేశామని తెలిపారు. ట్రాన్స్ కో ఎస్ ఈ సంపత్ కుమార్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వంలో విద్యుత్ శాఖ అహర్నిశలు పనిచేస్తుందని తెలిపారు. వెంగళమ్మ చెరువులో నూతన సబ్ స్టేషన్ నిర్మాణాన్ని 40 రోజుల్లో పూర్తిచేసి రైతులకు సేవలు అందిస్తామని తెలిపారు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయమని వాటికి అనుగుణంగా విద్యుత్ శాఖ అధికారులు సక్రమంగా విధులు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి పైన ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఆర్డిటి సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డిని విద్యుత్ శాఖ ఎస్ ఈ సంపత్ కుమార్ ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. సూర్య ఘర్ ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకుంటే వారికి బ్యాంకు రుణంతోపాటు నెల ఈఎంఐ సౌకర్యం కూడా కల్పిస్తామని అందుకు విద్యుత్ శాఖ అధికారులు సహాయ సహకారాలు అందిస్తారనీ తెలిపారు. అనంతరం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ వల్ల రైతులకు వ్యవసాయ ట్రాక్టర్ తో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఈఈ శివరాం డి ఈ కన్స్ట్రక్షన్ శ్రీధర్, ఈఓఆర్డి ఇందిరా ఏవో శ్రీవాణి,కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు విజయ కుమార్ ,శ్రీరామ్ రెడ్డి, సామకోటి ఆదినారాయణ,ఆదినారాయణ రెడ్డి ,బొమ్మయ్య , కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular