Wednesday, February 11, 2026

గంగా ప్రసాద్ కు ఎస్ఐగా పదోన్నతి

నిజాయితీకి నిజరూపం

బోధన్ ప్రాంత ప్రజలు హర్షం

నిజామాబాద్ ప్రతినిధి అక్టోబర్ 8 ద్రోణ

ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసేవారు ఎంతోమంది ఉన్నారు. విధి నిర్వహణ పరమావధిగా భావించే ఉద్యోగులు కొంతమంది ఉన్నారు అనడానికి గంగా ప్రసాద్ నిదర్శనం. బోధన్ పట్టణానికి చెందిన గంగ ప్రసాద్ బోధన్ లో సైతం ఏఎస్ఐ గా విధులు నిర్వహించారు. ఏనాడు బంధుత్వానికి ఇతర ఏ వ్యామోహానికి పాల్పడేవారు కాదు. తాను పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ పై అధికారుల ఆదేశాలను తూచ తప్పకుండా విధి నిర్వహణ నిర్వహించేవారు. వివాదారహితుడిగా మంచి సేవాగుణం కల వ్యక్తిగా విధినిర్వహణలో పేరు ప్రతిష్టలు గంగా ప్రసాద్ సంపాదించారు. విధి నిర్వహణలో ఏనాడు స్వార్థానికి పాల్పడేవారు కాదు. అవినీతి రహితుడిగా ప్రత్యేక స్థానాన్ని ఈ ప్రాంతంలో ఆయన సంపాదించారు. బోధన్ ప్రాంతంలో గతంలో మంజీరా నది నుండి ఇసుక రవాణాకు ప్రభుత్వం అనుమతులను ఇచ్చింది. అటువంటి సందర్భంలోనూ అప్పటి శాసనసభ్యులు, ఇసుక నిర్వహకులకు తేడాలు వచ్చాయి. అటువంటి సందర్భంలో ఇసుక రవాణాలో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు మంజీరా నది వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. అటువంటి కఠినమైన పరిస్థితుల్లోనూ గంగా ప్రసాద్ విధులు నిర్వహించారు. అటువంటి అవినీతి అక్రమాలకు అతిగా తావుండే ఇసుక రవాణాలో ఏనాడు ఏ ఒక్కరి వద్ద ఏ ఒక్క రూపాయి తీసుకోకపోవడం ఆయన నీతి నిజాయితీకి నిదర్శనం. ఎంతోమంది ఇసుక రవాణాలో డబ్బులు ముట్ట చెప్పి తమ అక్రమాలు కొనసాగించాలనే ప్రయత్నం చేసేవారు. అటువంటి ఇసుక రవాణాలో సైతం ఎంతోమంది బడా బాబులకు సైతం కళ్లెం వేశారు. ఇటువంటి నీతి నిజాయితీ గల పోలీస్ అధికారులకు ప్రమోషన్ ఇవ్వడం ఎంతో అభినందనీయం. బోధన్ ప్రాంత ప్రజలు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాదులో ఇద్దరు ఏఎస్ఐ లకు ఎస్సై లు గా ప్రమోషన్ పొందిన వారిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశానుసారముగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏఎస్ఐ నుండి ఎస్సై లుగా ఇద్దరు ప్రమోషన్ పొంది నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్సాయి చైతన్య,
ని కలవడం జరిగింది.
గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి ఏఎస్ఐ లకు ఎస్సై లుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని ఈ సందర్భంగా ప్రమోషన్ పొందినటువంటి ఏ ఎస్ ఐ లకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
పదోన్నతి పొందినటువంటి వారి వివరాలు

ఈశ్వర్ నిజామాబాద్ టౌన్ 3 PS నుండి ఆదిలాబాద్ కు
గంగా ప్రసాద్, ASI To SIP, రెంజల్ PS నుండి అదిలాబాద్ జిల్లా కు బదిలీపై వెళ్లారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular