మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే
జుక్కల్ ప్రతినిధి అక్టోబర్ 8 ద్రోణ
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ యస్ అభ్యర్థులను నిలబెట్టి గులాబీ జెండాను నియోజకవర్గంలో ఎగరవేయాలని, భారతీయ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే పిలుపునిచ్చారు. పిట్ల మండలంలో పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ వార్డుమెంబర్ పదవులను కైవసం చేసుకోవాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే టిక్కెట్లు కేటాయిస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, కష్టపడి పనిచేస్తే బి ఆర్ యస్ పార్టీ ని గెలిపిస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీలు అమలు చేయలేదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ అందించాలని హన్మంత్ షిండే కోరారు.
రైతులకు ఎన్నో గోసలు పెడుతున్నారు. యూరియా కొరకు పడిగాపులు కాస్తున్నారు.కెసిఆర్ ప్రభుత్వం లో ఏనాడు రైతు కంట నీరు కార్చలేదన్నారు. రైతులను 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం సంతోషంగా ఉంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమం లో ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దాపేధర్ రాజు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ లు, మాజీ జడ్పీటీసీ లు, మాజీ సర్పంచ్ లు, సొసైటీ చైర్మన్ లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




























