మెదక్ ప్రతినిధి అక్టోబర్ 8 ద్రోణ
తుఫాన్ పట్టణంలో బాంబు స్క్వాడ్, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ లతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు నిర్వహించారు.
మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ముఖ్యంగా బస్ స్టేషన్, దాబాలు, హోటళ్లు, పాన్ షాపులు మరియు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో Anti Sabotage Checks మరియు Narcotic Checks నిర్వహించబడ్డాయి.
తనిఖీలలో బాంబ్ స్క్వాడ్ మరియు నార్కోటిక్ డాగ్ బృందాలు పాల్గొని ప్రతి మూలను పరిశీలించాయి. ప్రజల భద్రతను కాపాడటం, నేరాలను అరికట్టడం, అలాగే అక్రమ మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యం.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసులు 24 గంటలు ప్రజల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని, ప్రజల సహకారం అత్యంత అవసరమని తెలిపారు.
ఇలాంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా నిరంతరంగా కొనసాగుతాయని, జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఎస్ఐ జ్యోతి , ఏఎసై శ్రీనివాస్ డాగ్ స్క్వాడ్ శ్రావణ్ మరియు బాంబ్ స్క్వాడ్ సిద్దిరాములు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

