Monday, December 15, 2025

బీడీ కార్మికులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తాం

బోధన్ అక్టోబర్ 12 ద్రోణ

బీడీ కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వెంటనే విరమించుకోవాలని బీడీ కార్మికుల న్యాయమైన కోర్కెలు సాధించేవరకు ఉద్యమాలు చేపడతామని బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ హెచ్చరించారు.దేశవ్యాప్తంగా బీడీ పరిశ్రమపై కోటిన్నర మంది ఆధారపడి జీవిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల మంది బీడీ పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు.
కేంద్రంలో మోదీ నాయకత్వంలోని బీ జే పీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కోటిన్నర మందికి ఉపాధిని కల్పిస్తున్న బీడీ మార్కెట్ ను మల్టీ నేషనల్ కంపెనీలకు అప్పజెప్పే పెద్ద కుట్రను చేస్తున్నదని తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ మండిపడ్డారు.
శనివారం బోధన్ పట్టణంలో బీడీ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల మంది, తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల మంది, దేశవ్యాప్తంగా 60 లక్షల మంది బీడీ కార్మికులు 40 లక్షల మంది పొగాకు పండించే రైతులు, 50 లక్షల మంది తునికాకు తెంపే కార్మికులు మొత్తం కోటిన్నర మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని, అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బీడీలు త్రాగడం మూలంగా క్యాన్సర్ వస్తుందని బీడీ కట్టలపై పుర్రె, ఎముకల గుర్తులను ముద్రించాలంటూ ఇంకా అనేక ఆంక్షలు విధించడం మూలంగా,కోప్టా చట్టాన్ని తీసుక రావడం మూలంగా బీడీల మార్కెట్ తగ్గుతున్నందున బీడీలు చేసే కార్మికులకు సగం పని మాత్రమే దొరుకుతున్నందున వారి కుటుంబాలు గడవడం కష్టమవుతుందని అర్ధాకలితో అల్మటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ కార్మికులకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను చూపించకుండానే బీడీ మార్కెట్ ను బడా బడా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని బి మల్లేష్ తీవ్రంగా విమర్శించారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఉపాధిని కల్పిస్తున్న పరిశ్రమ బీడీ పరిశ్రమనేనని ప్రభుత్వం నుండి నయా పైసా పెట్టుబడి లేకుండా ప్రభుత్వానికే ఆదాయాన్ని కల్పిస్తున్నటువంటి పరిశ్రమలోని కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించకుండా అందులో పని చేసే కార్మికులు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని చేశారు.ఈ కార్యక్రమంలో రాములు, కవిత,రూప, అనిత, నాగరాణి, సావిత్ర,కవితా, సురేఖ, భాగ్యలక్ష్మి, భానూబీ, శశిరేఖ, అలేఖ్య, జ్యోతి మరియు బీడీ కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular