కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 11 ద్రోణ
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
భారతీయ జనతా పార్టీ కామారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం కామారెడ్డి పట్టణంలో నిర్వహించారు. *కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టు తీర్పు కారణంగా వాయిదా పడ్డప్పటికి ఏ క్షణాన అయినా మళ్ళీ నోటిఫికేషన్ రావచ్చు అని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి అని అన్నారు. నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జెడ్పిటిసి , సర్పంచ్ స్థానాలకు ఏ రిజర్వేషన్ వచ్చిన పోటీకి అభ్యర్థులు ఉన్నారనీ అన్నారు. గ్రామాలలో కార్యకర్తల సమావేశం నిర్వహించి పోటీ చేసే అభ్యర్థులను తీర్మానం చేసి ప్రతిపాదించారని అన్నారు. పోటీ చేసే అభ్యర్థులు, కార్యకర్తలు అందరూ సమన్వయం చేసుకొంటూ గెలుపు లక్ష్యంగా పని చేయాలనీ అన్నారు.


