Monday, December 15, 2025

శిక్షణార్థులకు సౌకర్యాలు కల్పించాలి

శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన సిపి సాయి చైతన్య

బోధన్ ప్రతినిధి అక్టోబర్ 13 ద్రోణ

పోలీస్ శిక్షణ కేంద్రంలో మెరుగైన సౌకర్యాలను కల్పించాలని నిజామాబాద్ సిపి సాయి చైతన్య కోరారు.
సోమవారం ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట వద్ద గల పోలీసు శిక్షణ కేంద్రమును పోలీస్ కమిషనర్ పర్యవేక్షించారు.
ఆయన మాట్లాడుతూ రాబోయే శిక్షణార్థులకు అనుకూలంగా ఉండే విధంగా అవసరమైన సౌకర్యాలు , వసతులు అందుబాటులో ఉండాలని పోలీస్ బాస్ ఆదేశించారు.పోలీస్ శిక్షణ సెంటర్ అనేది భవిష్యత్ పోలీస్ అధికారుల పాత్రను తీర్చిదిద్దే కేంద్రం. ఇక్కడ శిక్షణ పొందేవారికి శారీరక , మానసిక అభివృద్ధి జరిగేలా వాతావరణం ఉండాలన్నారు.తగిన వసతులు , శిక్షణా పరికరాలు , మరియు శిక్షకులు అందుబాటులో ఉండేలా చూడాలి అని పేర్కొన్నారు.సెంటర్‌లో వసతులు, ట్రైనింగ్ సెంటర్ గదులు,వంటశాల,నీటి సరఫరా,శౌచాలయాలు ఇండోర్ తరగతి గదులు అవుట్ డోర్ పరేడ్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్ తదితర అంశాలను పరిశీలించారు. తక్షణమే కొంతమేర మెరుగుదలలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో బోధన్ ఏసిపి శ్రీనివాస్ , బోధన్ రూరల్ సి.ఐ విజయ్ బాబు, ఎడపల్లి ఎస్సై రమ మరియు ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular