Wednesday, February 11, 2026

కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే మహిళల పాత్ర కీలకము

బోధన్ అక్టోబర్ 27 ద్రోణ

కుటుంబాలు ఆరోగ్యంగా అన్ని రంగాల్లో పొందుండాలంటే మహిళా మండల పాత్ర ఎంతో అవసరమని వ్యవసాయ ప్రభుత్వ సలహాదారులు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాహారాలు ఎంతగానో ఉపయోగపడతాయి పోషకాహారం అవసరంపై ప్రతి ఒక్క మహిళకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అంగన్వాడీ కార్యకర్తల పై ఉందన్నారు.బాన్సువాడ పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మి నరసింహ కళ్యాణ మండపంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన పోషణ మాసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోచారం హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన పౌష్టికాహారం గురించి ప్రతి ఇంటిలో అవగాహన కల్పించడమే పోషణ మాసం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని, ఒక కుటుంబం ఆరోగ్యంగా ముందుకు వెళ్లాలంటే కుటుంబంలో మహిళల పాత్ర ప్రత్యేకం అని అన్నారు.
మహిళలు, గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో పోషకాహార ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండేందుకు సమాజంలో పోషణపై అంగన్వాడీ సిబ్బంది అవగాహన కల్పించాలని తెలిపారు .గర్భిణీ స్త్రీల పోషణ స్థితిని మెరుగుపరిచినట్లయితే మన భావి తరాల పిల్లలు పోషణ లోపం లేకుండా ఆరోగ్యంగా జన్మిస్తారు, అప్పుడు భావితరాలు పోషణ లోపం లేకుండా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, సిడిపిఓ సౌభాగ్య, వివిధ మండలాలు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడి టీచర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular