డీ ఫ్లోరైడ్ పథకాలకు మూత
మంజీరా లో కొట్టుకుపోయిన పైపులు
సింగూరు నీరు ఎప్పుడొస్తుందో తెలియని అయోమయం
బోధన్ ప్రతినిధి అక్టోబర్ 25 ద్రోణ
ఇంటింటికి మంచినీటి సరఫరా పేరిట గత ప్రభుత్వం 40,000 కోట్ల పైగా నిధులను వెచ్చించింది. మహిళలు ఎవరు ఇబ్బందులకు గురి కావద్దన్న సంకల్పంతో ఆనాడు మిషన్ భగీరథ పేరిట ప్రతి గ్రామంలో మంచినీటి ట్యాంకు, కొత్త పైపులైన్ల ద్వారా ప్రతి ఇంటికి కులాయి కనెక్షన్లను అందించారు. ప్రభుత్వం ఎంతో దృడ సంకల్పంతో 40,000 కోట్ల రూపాయలను వెచ్చించినప్పటికీ ప్రజలకు మాత్రం మంచినీటి కష్టాలు తీరలేదని చెప్పవచ్చు. గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన ప్రజాప్రతినిధులు, పట్టించుకునే అధికారులే కరువయ్యారు. పోతంగల్ మండలం గ్రామాల అంచునే మంజీరా నది గలగల గజ్జల సప్పులతో సెలయేరులా పారుతుంది. మంజీరా అంచున ఉన్న గ్రామాలు సైతం నీటి సరఫరా కావకపోవడంపై ప్రజలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సుంకినిలో మహిళలకు తప్పని కష్టాలు
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం సుంకిని గ్రామంలో గత 70 రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. మంజీరా అంచునే ఉన్నప్పటికీ గ్రామానికి నేటి సరఫరా అందించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. త్రాగునీటి కోసం గ్రామస్తులు పడరాని పాట్లు పడుతున్నారు. మహిళలు బిందెలను నెత్తిన ఎత్తుకొని దూర ప్రాంతాల నుండి నీటిని తీసుకువస్తున్నారు. తమ సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. మిషన్ భగీరథ పేరిట స్థానికంగా ఉన్న నీటి సరఫరా వ్యవస్థను చిన్నభిన్నం చేశారు. మంజీరా నదిలో రెండు నెలలుగా పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తుంది. పక్కనే నీరున్న గొంతు ఎండితోందని ప్రజలు వాపోతున్నారు. గత ప్రభుత్వం మంజీరా అంచున ఉన్న గ్రామాలకు సైతం సింగూర్ నీటిని సరఫరా చేస్తున్నారు. సింగూరు నీరు సైతం రావడంలేదని గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు. గ్రామానికి నీటి సరఫరా కోసం ఆనాడు మంజీరా నది నుండి పైప్లైన్ ఏర్పాటు చేశారు. గత నెల రోజుల నుండి మంజీరా నది ఉధృతంగా ప్రవహించడంతో మంజీరా నదిలో ఉన్న పైప్ లైన్ వరదకు కొట్టుకుపోయింది. ప్రత్న్మయ ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజల నీటి కష్టాలను తీరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గతంలో డీ ఫ్లోరైడ్ పథకాలతో ఈ ప్రాంత ప్రజలకు మంజీరా నీటిని సరఫరా చేసేవారు. మిషన్ భగీరథ పేరిట ఇటువంటి పథకాలను మట్టుపెట్టేశారు. గతంలో ఈ ప్రాంతంలో బోర్లలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉందని గత 30 ఏళ్ల క్రితం అధికారులు తేట తెల్లం చేశారు. ఆనాటి ప్రభుత్వాలు బోరు బావుల నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడటాన్ని ధ్రువీకరించారు. ఆనాటి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ ప్రాంతంలో మంజీరా ను ఆధారంగా చేసుకుని నీటి పథకాలను ఏర్పాటు చేశారు. కారేగాం డి ఫ్లోరైడ్ పథకం ద్వారా ఆనాడు 22 గ్రామాలకు తాగునీటి సరఫరా జరిగేది. అటువంటి పథకాలను తుంగలో తొక్కారు. ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు ఎంతోమంది ఎన్నో గ్రామాల వారు నీటి కష్టాలు తీర్వాలని ప్రజా ప్రతినిధులకు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. అయినప్పటికీ ఈ ప్రాంత ప్రజల నీటి కష్టాలను మాత్రం తీర్చేందుకు అధికారులు ముందుకు రాకపోవడం పట్ల తమ అసంతృప్తిని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు క్షుణ్ణంగా పరిశీలన జరిపి ఈ ప్రాంత ప్రజల తాగునీటి కష్టాలను తీర్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రాంత గ్రామాలకు అతి సమీపంలో మంజీరా నది ప్రవహిస్తున్నప్పటికీ ఎక్కడో సింగూర్ నుండి నీటిని సరఫరా చేయడం పట్ల ప్రజలు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోయిందో అన్న చందంగా ప్రస్తుతం సింగూరు నీరు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు నిలుపుదల చేస్తారో ప్రజలకు మాత్రం అంతు పట్టడం లేదు.
ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజల నీటి కష్టాలను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తీరుస్తారన్న నమ్మకంతో ప్రజలు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.




