Wednesday, February 11, 2026

సోయా పంటను కొనుగోలు చేయాలి

రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ బిజెపి డిమాండ్

బోధన్ ప్రతినిధి అక్టోబర్ 27 ద్రోణ

అపార వర్షాలకు జిల్లా రైతాంగం పంటలు సాగులో ఎంతో నష్టపోయారని, చేతి కందిన కొద్ది పంటను ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేయాలని బిజెపి ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. గత నెలలో విపరీతమైన వరదలు వచ్చి వరి,సోయా పంటలు మునిగిపోయి ఏదో కాస్త మిగిలిన సోయా చిక్కుడు పంట చేతికి వచ్చి నెల గడిచిపోయిన ఇప్పటికీ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వరదలో మునిగిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించకపోగా పండిన కాస్తంత పంట ప్రభుత్వం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. రైతులకు వీలైనంత తొందరగా సోయా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గత నెలలో మంజీరా పరివాహక ప్రాంతంలో భారీ వరద లతో పూర్తిగా నష్టపోయిన పంటకు నామమాత్రంగా ప్రభుత్వం నివేదికలు తీసుకుంది. ఇప్పటివరకు నష్టపరిహారం గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కలెక్టర్ కి నివేదించారు. పెగడపల్లి గ్రామంలో గత ప్రభుత్వంలో మంజూరై నిర్మాణం పూర్తయినప్పటికీ ఇప్పటికీ వారికి బిల్లులు చెల్లించకపోవడం శోచనీయం. కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత యాసంగి పంటలో ధాన్యానికి బోనస్ చెల్లిస్తానని చెల్లించకపోగా ఇప్పుడు కూడా బోనస్ ఇస్తామని ప్రకటించినప్పటికీ రైతులు నమ్మలేని పరిస్థితి నెలకొంది. ముందుగా ప్రభుత్వం యాసంగి బోనస్ చెల్లించితేనే ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి కలుగుతుంది. ముందుగా యాసంగి బోనస్ చెల్లించాలని అదే విధంగా పూర్తిగా రుణమాఫీ,రైతు భరోసా, ప్రజల కు నెరవేరుస్తానన్న హామీలను పూర్తిగా నెరవేర్చి ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ ఈ కార్యక్రమంలో బోధన్ మండల్ రూరల్ బిజెపి అధ్యక్షులు సుదర్శన్,మాజీ మండల అధ్యక్షులు రాజురే మనోహర్, బూత్ అధ్యక్షులు అనిల్,నాయకులు గోపి, సిరిగిరి మోహన్, మోహన్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular