మున్సిపల్, సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద కార్మిక సంఘాల నిరసన
బోధన్ అక్టోబర్ 27 ద్రోణ
బోధన్ మున్సిపల్ కార్మికురాలు విధులు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచింది. బాధిత కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ కార్మిక సంఘాలు బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. నష్టపరిహారంతో పాటు బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.
సోమవారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గాంధీ పార్క్ ఎదురుగా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికు ర్యాలీగా విధులు నిర్వహిస్తున్న రాజం నాగమణి కి సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్ అతివేగంగా వచ్చి గుద్దుకొని సుమారు 50 ఫీట్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది.ఆమె ఎడమ కాలు నుజ్జునుజ్జు అయింది. ఇంకా శరీరంలో అనేక గాయాలయ్యాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో డాక్టర్లు లేరని నిజామాబాద్ కు రిఫర్ చేశారు. అక్కడ కూడా వెళ్లిన తర్వాత రెండు గంటలు తర్వాత వైద్యము చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ ఆమె మృతి చెందారు.
ఆ వార్త విన్న కార్మికులు టి యు సి ఐ, ఐఎఫ్టియు, ఆమ్ ఆద్మీ పార్టీ, మాజీ వైస్ చైర్మన్ ఖాదర్ తదితరుల ఆధ్వర్యంలో మృతి చెందిన కార్మికురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ మున్సిపల్ కార్యాలయం ముందు మరియు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బయటాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకున్నారు.
మృతి చెందిన కార్మికురాలికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఇందిరమ్మ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. సబ్ కలెక్టర్ వికాస్ మహాతో కి డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టి యు సి ఐ రాష్ట్ర నాయకులు బి. మల్లేష్, ఐ ఎఫ్ టి యు నాయకులు డి.పోశెట్టి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు జువేద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఖదీర్ తదితరులు మాట్లాడుతూ బస్సు ప్రమాదంలో చనిపోయిన రాజం నాగమణికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇయ్యాలని, యాక్సిడెంట్ చేసిన బస్సు డ్రైవర్ నుండి ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుండి నష్టపరిహారం ఇప్పించాలని, ప్రభుత్వపరంగా ఇందిరమ్మ డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, మున్సిపల్ వారు ఉదయము పనులు చేయించేటప్పుడు కార్మికులకు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కార్మికులకు అందరికీ డ్రెస్సులు ఇవ్వాలని, కార్మికులను వేధింపులకు గురి చేయొద్దని, మహిళల చేత పురుషులు చేసే పనులను చేయిస్తూ ఇబ్బందులకు గురి చేయొద్దని డిమాండ్ చేశారు. చర్చలు జరిపిన సబ్ కలెక్టర్ వికాస్ మహా తో డిమాండ్లన్నింటిని కలెక్టర్ మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మృతి చెందిన రాజ నాగమణి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

