నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ:-
సిపిఐ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని తెలిపారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాలను చూస్తూ ఉంటే అధికారుల నిర్లక్ష్య వైఖరి జోరుగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా వాహనాలు చట్టానికి విరుద్ధంగా దూసుకు వెళ్లడం ప్రతి ఒక్కరికి కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. జిల్లాలో మహారాష్ట్రకు వెళ్తున్న ప్రైవేటు బస్సులు అదేవిధంగా స్కూల్ బస్సులను ఆర్టీవో అధికారులు ఫిట్నెస్ మరియు ఇన్సూరెన్స్ పై తనిఖీచేయాలని డిమాండ్ చేశారు.

ప్రెస్ మీట్ లో సిపిఐ నగర కార్యదర్శి వై.ఓమయ్య నాయకులు రాధాకుమార్, ఆనంద్ పాల్గొన్నారు
