Wednesday, February 11, 2026

పోలీస్ అమరవీరులకు ఘన నివాళి

కోటగిరిలో కొవ్వొత్తుల ర్యాలీ

కోటగిరి అక్టోబర్ 30 ద్రోణ

పోలీస్ అమరవీరులకు కోటగిరి లో శుక్రవారం సాయంత్రం ఘన నివాళులు అర్పించారు. కోటగిరి పోలీసుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమర్లకు నివాళులు అర్పించి స్మరించుకున్నారు. విధి నిర్వహణలో ఉండి ఎంతోమంది పోలీస్ ఉద్యోగులు తమ ప్రాణాలను విడిచారని కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు విడిచిన వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోటగిరి పోలీసులు ప్రార్థించారు. శాంతి సమాజా పరిరక్షణ తోపాటు ప్రజలకు అండగా ఉండడమే పోలీసుల లక్ష్యమని ఎస్సై అన్నారు. పోలీస్ ఉద్యోగం చేసే వారికి రాత్రి పగలు అనే తేడా ఉండదని, ఎక్కడ సమస్య తల ఎత్తితే అక్కడ పోలీసులు వెళ్లి సమస్యను పరిష్కరించడమే దేయంగా పనిచేస్తారన్నారు. పోలీసులు వారి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి అయినా సరే విధి నిర్వహణ బాధ్యతగా చేపట్టాల్సి ఉంటుందన్నారు. సమాజ పరిరక్షణ కోసం పనిచేసే పోలీసులను కొంతమంది దుర్మార్గులు ఎదురు దాడి చేసి ప్రాణాలు తీయడం మంచి పద్ధతి కాదన్నారు. పోలీసులకు ప్రజలు కూడా అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించాలని కోరారు. కోటగిరి మండలంలో ఎవరికే సమస్య వచ్చినా తాము ఆ ప్రదేశాలకు వెళ్లి వారి సమస్య పరిష్కారానికి కృషి చేయడంతో పాటు శాంతియుతంగా ప్రజలు జీవనం కొనసాగించడంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమన్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలబడాలని కోటగిరి పోలీసులు తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ బన్సీలాల్, పలువురు పోలీస్ కానిస్టేబుళ్లు, స్థానిక ప్రజలు యాదవరావు, నజీర్, మహబూబ్, భూమేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular