Wednesday, February 11, 2026

గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో DTDO కి వినతి పత్రం

బోధన్ టౌన్ ద్రోణ:-

నిజామాబాద్ గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జాదవ ప్రవీణ్ నాయక్ డి టి డి ఓ కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. జిల్లా పరిధిలోగల ఎస్టి బాల బాలికల వసతి గృహాలలో కనీస అవసరాలు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. ఎస్టి వసతి గృహాలలో కిటికీలకు దోమతెరలు ఫ్యాన్లు మరియు మరుగుదొడ్ల యొక్క తలుపులు విరిగి ఉన్నాయి. హాస్టల్లోని పిల్లలకు మెనూ ప్రకారం భోజన వసతి క్రమం తప్పకుండా కల్పించాలని జిల్లా గిరిజన శాఖ అధికారిని కలిసి వసతి గృహాల సమస్యల గురించి చర్చించి వసతి గృహాలను సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. స్పందించి వసతి గృహాలను లోటుపాట్లను వెంటనే పర్యవేక్షించి విద్యార్థిని విద్యార్థులకు మంచి భోజనంతోపాటు వసతులు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థులు కూడా వసతిగృహాలలో క్రమశిక్షణ పాటించి వసతి వసతి గృహాన్ని శుభ్రంగా చూసుకోవాలని సూచించడం జరిగింది. వసతి గృహాల వార్డెన్లు విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించి సమయపాలన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొర్రా బన్నీ నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular