ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకి కార్పొరేషన్ లో పదవులు

నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ:-
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయింది. మంత్రి పదవి కోసం ఎదురుచూసిన సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావులకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు కేటాయించింది రేవంత్‌రెడ్డి సర్కార్. నవంబర్‌లో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు సమాచారం. అయితే కేబినెట్ విస్తరణలో భాగంగా కొంతమందిని పక్కన పెట్టి కొత్తవారికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సామాజిక వర్గాలు, ఉమ్మడి జిల్లాల ప్రాధాన్యత ఆధారంగా కేబినెట్ కూర్పు చేయనున్నట్లు తెలుస్తోంది.
కాగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని నియమించింది. కేబినెట్ హోదాతో తెలంగాణ ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. 6 గ్యారెంటీల అమలు బాధ్యతని సుదర్శన్‌రెడ్డికి అప్పగించింది కాంగ్రెస్ సర్కార్. అయితే, మంత్రి పదవిని సుదర్శన్‌రెడ్డి ఆశించారు. సివిల్ సప్లాయీస్ కార్పొరేషన్ చైర్మన్‌గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుని నియమించింది. కేబినెట్ హోదాతో కార్పొరేషన్ చైర్మన్‌గా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కొనసాగనున్నారు. మంత్రిపదవులు ఆశించిన సీనియర్లకు కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగిస్తుంది.. KP
