
పట్టణంలో రక్తదాన శిబిరం
బోధన్ టౌన్ ద్రోణ:-
బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో మంగళవారం సీఐ వెంకటనారాయణ స్వయంగా రక్తదాన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ యువత ఉత్సాహంగా స్పందించి పెద్ద సంఖ్యలో రక్తదానం చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని ఆయన తెలిపారు.

అదేవిధంగా ఈ కార్యక్రమంలో పట్టణ ఏసిపి శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్సై చందర్ రెడ్డి, పట్టణ ఎస్సైలు పోలీస్ సిబ్బంది. మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజలు పాల్గొన్నారు. రక్తదాన శిబిరం స్ఫూర్తిదాయకంగా పోలీస్ విభాగం సామాజిక సేవా కార్యక్రమాలలోనూ ముందుంటామని నిర్వాహకులు తెలిపారు.
