
ప్రైవేటు కల్లు దుకాణమా
ప్రభుత్వ అధికారుల లోపమా
ఇది ప్రభుత్వం కట్టియలేదా
మార్కెట్ కమిటీ ప్రజల కళ్ళు కప్పుతుంది
వ్యవసాయ సహకార అధికారుల నిర్లక్ష్యమా
కళ్ళు దుకాణం కోసం
ఎవరు అద్దెకిచ్చారు
బోధన్ టౌన్ ద్రోణ:-నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో బైపాస్ మీదుగా పంట వెళ్లే రోడ్డులో ఈ సహకార సంఘం ఏర్పాటు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా రైతులకు అండగా నిలిచినది 500 మెట్రిక్ టన్నుల గిడ్డంగిని ఒక కల్లుబట్టిగా మార్చడం మూడున్నర సంవత్సరాలుగా ప్రజల కన్నుగప్పి ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. రైతులు తమ అవసరాలకు అనుకూలంగా విత్తనాలు ఎరువులు వంటి వ్యవసాయ సరఫరాలను స్థానికంగా సులభంగా పొందగలిగేలా గిడ్డంగులను వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఆ గిడ్డంగిని కళ్ళు కాంపౌండ్ గా మార్చి అధికారులు అద్దెలకు ఇచ్చుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి రైతుల కోసం ఏదో చేయాలి అన్న తపనతో ఉంటే మార్కెట్ కమిటీ మాత్రం ప్రజల కళ్ళు కప్పుతూ ఇలాంటి చాటుమాటు వ్యవహారాలు సాగిస్తున్నారు. ప్రభుత్వాలేమో రైతే రాజు రైతు లేకపోతే ప్రజలే లేరంటూ నినాదాలు ఇస్తూ ప్రజల సొమ్మును పరాయి సొత్తు కింద వాడుకుంటూ మార్కెట్ కమిటీ వారు జేబులు నింపుకుంటున్నారు. రైతులు వర్షాకాలంలో వారికి సౌకర్యాన్ని కల్పిస్తే అదే గిడ్డంగిలో ఐదు నుంచి ఆరు వేల మధ్య బస్తాలు పట్టే వ్యవధి ఉన్న రైతులను మాత్రం పట్టించుకోకుండా వారి స్వార్థానికి అధికారులు ధీమాతో ఉన్నారని ఇక్కడ కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది.
బోధనలో గీత కార్మికుల వివాదం

బోధన్ పట్టణంలో గీత కార్మికుడైనటువంటి ఒకటవ సంఘం అధ్యక్షుడు గంగాధర్ గౌడ్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోధన్ కలెక్టర్ కు పలువురు గౌడ సంఘ సభ్యులు వినతి పత్రం అందించడం జరిగింది. అంతేకాకుండా లైసెన్స్ లేకుండా ఆల్ ఫ్రాజోలం వంటి రసాయనాలతో కళ్ళు తయారీ చేస్తూ కళ్ళు దుకాణాలకు పంపిస్తున్నాడని ఆరోపించారు. పలుమార్లు అట్టి విషయంపై ప్రజావాణిలో జిల్లా ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

ఎక్సైజ్ అధికారులు బోధన్ శంకర్ నగర్ లోని కళ్లి దుకాణం పై దాడులు నిర్వహించి మత్తు కలపని కళ్ళు సీసాలను సీజ్ చేసి తనిఖీలకు తీసుకువెళ్లారని అన్నారు. ఎక్సైజ్ అధికారులు మత్తులు వీడి అధికారికంగా డ్యూటీలు చేయడం లేదని ఆరోపణలు వేల వస్తున్నాయి. ఒకట వ కళ్ళు డిపో దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. గౌడ సంఘం వారిపై గంగాధర్ గౌడ్ పలుమార్లు వేధింపులకు గురిచేస్తూ ఎన్నో కేసులు నమోదు చేయించి ఇబ్బందుల పాలు గురి చేస్తున్నాడని వాపోతున్నారు. రెండవ కళ్ళు డిపో ఏర్పాటు కు తాము చేసిన ప్రయత్నాలకు అడ్డంకు తగులుతూ అధికారులతో ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని (ఆర్డిఓ) సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. అతని వల్ల కొన్ని సంవత్సరాలుగా గౌడ సంఘంలో వివక్షలు రేకెత్తుతున్నాయని పలుమార్లు అధికారులకు సూచించారు. గీత కార్మికుల సంఘం అధ్యక్షులకు పై పెత్తనం ఏ విధంగా అంట కడతారంటూ సంఘ సభ్యులపై వ్యతిరేక విమర్శలు చేస్తూ సంఘ సభ్యులను స్థానికులు కాదు అంటూ లెక్క తేలుస్తానంటూ పట్టణ కౌడిన్య గౌడ సంఘం అధ్యక్షులపై రొమ్ము విరుచుకొని బెదిరిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కార్యాలయానికి కౌడిన్య గౌడ సంఘం అధ్యక్షుడు నరేష్ గౌడ్ మారుతి గౌడ్ నాగార్జున గౌడ్ షరీష్ గౌడ్ గంగాధర్ గౌడ్ గంగాసాగర్ గౌడ్ సాయ గౌడ్ మహేష్ గౌడ్ భీష్మ గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది.
