Wednesday, February 11, 2026

ఎస్టీలకు ఎమ్మెల్యే మంత్రి పదవి కావాలి

బోధన్ టౌన్ ద్రోణ:- బోధన్ నియోజకవర్గంలోని గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జాదవ్ ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో లంబాడా సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వకపోవడం సిగ్గు గా ఉందని ప్రజల ముసుగులో యావత్ తెలంగాణ బంజారా ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి లంబాడా ఓట్లు కీలకమని అనేక సందర్భాలలో గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగిందని అట్టి ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థ ఎన్నికలలో బుద్ధి చెప్పాలని ఓటును ఉపయోగించుకొని గిరిజన విద్యార్థి సంఘంలో ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే మొన్నటికి మొన్న మాజీ ఎంపీ సోయం బాబూరావు మరియు తెల్లం వెంకట్రావు బంజారాలను ఎస్టీ జాబితా నుండి తీసివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం పై కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేటు ఇట్టి విషయాన్ని తెలంగాణ బంజారా ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

సామాజిక వర్గంలో వెంటనే ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని గిరిజన విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్ర బన్నీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular