Sunday, March 29, 2026

బి ఎస్ పి పార్టీలో భారీ చేరికలు

బోధన్ టౌన్ ద్రోణ:- బోధన్ నియోజకవర్గంలోని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు దాడి రమేష్ ఆధ్వర్యంలో అందాపూర్ గ్రామానికి చెందిన మైనార్టీ నేత షేక్ ఇస్మాయిల్ తో పాటు బిసి, ఎస్సి కి చెందిన సుమారు 20 మంది బీఎస్ పి పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారికి స్టేట్ లీడర్ నీరడీ ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు సింగడే పాండు కండువా వేసి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. బీ ఎస్ పి పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల హక్కుల కోసం కృషి కృషి చేస్తూ కార్యక్రమాలు చేపడుతుంది ఆ కార్యక్రమాలపై ఎంతోమంది ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిరివేసు సంతోష్, బోధన్ అసెంబ్లీ ఇన్చార్జ్ నీరడి రవి, పట్టణ అధ్యక్షుడు షేక్ మహమ్మద్, బాన్సువాడ అసెంబ్లీ ఇన్చార్జ్ శ్యామ్, సాలూర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, బీ ఎస్ పి నేతలు నరేష్, సుభాష్, మంత్రి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular