Wednesday, February 11, 2026

సీపీలతో భేటీ అయిన ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్

ఐ డి ఓ సీ లో కలెక్టర్

బాధిత కానిస్టేబుల్ కుటుంబాని పరామర్శ

నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ:-

తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య శనివారం సమీకృత కార్యాలయ సముదాయంలో కలెక్టర్ టి.వి నయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. రెవెన్యూ అధికారులు, ఎస్సీ ఎస్టీ అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారులు కుల సంఘ నాయకులతో అట్రాసిటీ కేసులలో పురోగతి, ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఎస్సీ ఎస్టీలు సబ్ ప్లాన్ వివిధ శాఖల ద్వారా షెడ్యూల్ కులాలు తెగల వారి కోసం వెచ్చిస్తున్న నిధుల వివరాలు అడిగి ఆయా సమస్యలపై బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఐ డి ఓ సి కి చేరుకున్న కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్యను కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, పూల మొక్కను అందించి స్వాగతం చెప్పారు. అంతకుముందు ఆయన బాధ్యత సి సి ఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి విధి నిర్వహణ సందర్భంగా కానిస్టేబుల్ హత్యకు గురికావడం ఎంతో బాధ కలిగించిందని, బాధిత కుటుంబానికి కమిషన్ అండగా నిలుస్తుందని పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. అభివృద్ధి శాఖ అధికారులు, వివిధ కుల సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular