విపరీతమైన వర్షాలు
మా దాన్యం ఇంకా సొసైటీ వారు కొనలేదు

దిగుబడి గణనీయంగా తగ్గింది
కోటగిరి ద్రోణ:- పండించిన పంటను బోసి నవ్వుతో మురిసిపోయే రైతులకు హఠాత్తుగా గుండెలు పగిలాయి పండించిన ధాన్యం సొసైటీ కి అమ్మితే బోనస్తులు వస్తాయని ఆశతో రోడ్లపైన ధాన్యాన్ని ఆరబోసుకొని ఎదురుచూస్తున్న తరుణంలో ఎకరానికి 20 బస్తాల కాడికి రావడంతో రైతు ఆశలు నిరాశలై, దాంతో ఆగకుండా ఒక్కసారిగా వర్షం అతివృష్టితో రావడం రైతుల బాధకు హద్దే లేకుండా పోయింది. వారి గోడు ఎవరితో వెళ్లబుచుకోవాలో తెలియని తరుణం వర్షాలు రావడం వల్ల పంటలకు వ్యాధులు విజృంభించాయి వ్యవసాయ శాఖ అధికారులు సైతం సలహాలు సూచనలు ఇవ్వకపోవడం ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం ధాన్యం గిట్టుబాటు ధర వచ్చేంతవరకు నిలువ చేసుకుందామంటే సరియైన గోదాములు లేక రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారు వర్షాలకు తడిసిపోయి ముద్దయిపోతున్నా కానీ సొసైటీ వారు మాత్రం వరుస క్రమంలోనే తమను గుర్తిస్తామంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

ఒకవైపు వడ్లు మాచర్ రాలేదంటూ రైస్ మిల్లర్లు ఊచకోత కోస్తూ రైతులకు బతుకే బరువయ్యేలా చేస్తున్నారు. ఇదే రైతుకు శాపమా దీనిపై స్పందించే వారే లేరా అంటూ రైతులు వారి గోడు వెళ్ళబుచుకుంటున్నారు.
