ఇసుక అక్రమ రవాణా
అడిగిన వారిపై దౌర్జన్యం
మా సత్తా చూపిస్తామంటూ బెదిరింపులు
అధికారుల చూపు ఎటువైపు
అధికారుల నిర్లక్ష్య వైఖరి
బోధన్ టౌన్ ద్రోణ:- మంజీరా నది ఒడ్డున గల మందర్న, కల్దుర్కి, ఖడ్గం, వంటి గ్రామాలలో ఇసుక అక్రమ రవాణా పగలు రాత్రి అనే తేడా లేకుండా జోరుగా సాగుతుంది ఆదివారం సెలవు అధికారులు పట్టించుకోరు.

పోలీసులు మాకు తెలియదంటూ చేతులు ఎత్తివేస్తారు సెలవు దినం అనే కాకుండా ఇష్టారాజ్యం వచ్చినట్లు ఇసుక మాఫియా దారులు రెచ్చిపోతున్నారు దీనిపై పోలీసు ప్రత్యేక నిఘా ఎందుకు ఏర్పాటు చేయడం లేదో అర్థం కావడం లేదు ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని పలుమార్లు పత్రికలలో వచ్చిన నామమాత్రానికి వాహనాలను పట్టుకొని వదిలేస్తారు ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాలు అతివేగంగా ఇష్టారాజ్యం వచ్చినట్లు నడుపుతూ ద్విచక్ర వాహనాల మీద వెళ్లే ప్రజలకు ఎంతో ఇబ్బంది కరంగా మారుతుంది కానీ రహదారులలో ఒకవైపు వడ్లు రైతులు ఆరబోయడంతో ద్విచక్ర దారులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రోడ్లపై తిరుగుతున్నారు.

ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోల తో మాఫియా దారులకు సంబంధిత రెవెన్యూ పోలీస్ సహకారం మెండుగా కనిపిస్తుంది పోలీసు పెట్రోల్ వాహనాల ముందు నుండి వెళ్ళుతున్న పట్టినట్లు వ్యవహరిస్తూ గ్రీన్ సిగ్నల్ దొరుకుతుంది మైనింగ్ అధికారులు నిద్ర మత్తు మాత్రం వదలడం లేదు ప్రజలు ఎంతో ఆందోళన చేసిన యధావిధిగా కొనసాగిస్తున్నారే కానీ అధికారులు మాత్రం వెనక్కి తిరిగి కూడా చూడడం లేదని ప్రజలు వాపోతున్నారు.
