Wednesday, February 11, 2026

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో సెల్ ఫోన్ నిషేధం

ఏ స్థాయి వైద్యుడైన హాస్పటల్లో వినియోగిస్తే చర్యలు

మార్చురీ ఘటనపై ఇద్దరు అవుట్

సోర్సింగ్ వైద్యులపై వేటు

జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యులతో హోమియో మీటింగ్

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో మార్చి సంఘటనపై ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ రెండు రోజుల నుండి సమీక్ష సమావేశం శనివారం మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్ లో వైద్య సిబ్బందితో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్డెంట్ సమయపాలన పాటించడం లేదని వైద్య సిబ్బంది కూడా పాటించాలని హెచ్చరించారు. హాస్పటల్లో నర్సులు సైతం కాలా పేక్షణ చేస్తూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పనిచేస్తున్నారని కొంతమంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారని మేము సీనియర్లు అంటూ వారిపై కొరడా వేస్తున్నారని ఒక ఉద్యోగి కూడా డ్యూటీలో ఉన్నప్పుడు సెల్ ఫోన్లు ఉపయోగించరాదని అత్యవసరమైతే నార్మల్ ఫోన్లు ఉపయోగించాలని రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు త్వరలోనే చేస్తుందని ఈ సర్కార్ ఏర్పడిన తర్వాత మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉంటే మరోవైపు ఇలాంటి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించడం. మాకు బాధాకరంగా ఉందని కొన్ని రోజుల్లో జిల్లా ఆసుపత్రిలో మార్పులు రావాలని ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి పట్ల మర్యాదగా వ్యవహరించాలని ఎమ్మెల్యే మురళి నాయక్ హెచ్చరించారు.

బతికున్న మనిషిని మార్చరీకి తరలించిన ఘటనలో విధుల నిర్లక్ష్యం వహించిన ఔట్సోర్సింగ్ ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృత్తం అయితే హాస్పటల్ సూపర్డెంట్ ఆర్ఎమ్ఓ లపై మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ పై చర్యలు ఉంటాయని ఇది మన తెలంగాణలోనే రేవంత్ రెడ్డి సర్కార్కు మాయని మచ్చ అని ఎమ్మెల్యే హెచ్చరించారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular