జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా

నిజామాబాద్ రూరల్ డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి
హైదరాబాద్ ద్రోణ:- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా శారధి సొసైటీ, జనప్రియ కాలనీ, ప్రభాస్ నగర్ ప్రాంతాలలో ప్రజలతో భేటీ అవుతూ ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


ప్రతి వాడలో కాంగ్రెస్ వాతావరణం నెలకొంది ప్రజలంతా మార్పు కోసం ఎదురు చూస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని భూపతి రెడ్డి ప్రచారంలో తెలుస్తుంది.


నిజామాబాద్ వ్యవసాయ కమిటీ చైర్మన్ ముప్పు గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్, డిసిసి ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మోపాల్ మండల అధ్యక్షుడు సాయి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపి,

యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, మాజీ ఐ సి డి ఎం ఎస్ చైర్మన్ సాయి రెడ్డి, మాజీ జెడ్పిటిసి మోహన్, మాజీ సర్పంచులు బాగా రెడ్డి, జనార్ధన్, చిన్న సాయి రెడ్డి, మాజీ ఎంపీటీసీ శంకర్, యువ నాయకుడు రాజేష్, తదితరులు ప్రచారంలో జూబ్లీహిల్స్ లో స్థానికులు కూడా పార్టీకి మద్దతుగా ప్రచార ఎన్నికలలో పాల్గొంటామని చెబుతున్నారు.
