లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి
సూర్యాపేట ప్రతినిధి ద్రోణ:- లైసెన్సుడ్ సర్వేయర్లకు గౌరవ వేతనంతో పాటు విధివిధానాలతో కూడిన గైడ్ లెన్స్ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా సర్వేయర్లు సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరుగుతున్న ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కె, సీతారామారావు కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఐదు నెలల పాటు శిక్షణ కల్పిస్తుందని అనంతరం ఉత్తీర్ణత సాధించామని లైసెన్సులు జారీ చేసి చాలా రోజులు అవుతున్నాయని విధులలోకి తీసుకోకపోవడం అన్యాయం అన్నారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థను బలోపేతం చేస్తూ భూ వివాదాల సమస్యల పరిష్కారానికి తీసుకున్న నిర్ణయం గొప్పదని వ్యక్తం చేశారు తమ శ్రమకు తగిన ఫలితం కావాలని నెలవారీ గౌరవ వేతన సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా లైసెన్స్ సర్వేయర్లు పంతంగి సాలయ్య, ఈట ప్రశాంత్, గోపిరెడ్డి, సునీల్, పట్టేటి రాజు, సి హెచ్ నాగార్జున, ఎల్లయ్య, శాంతి వర్ధన్, మహేష్, హరి, సంపత్ కుమార్, రోశయ్య, తదితరులు ఉన్నారు.
