ఇక్కడ తప్పు చేస్తే వేరే దగ్గరికి బదిలీలు
విద్యాశాఖలో మార్పులు రావా
నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ:-కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గురుకుల విద్యార్థులు సూర్యాపేటలో బీర్లు తాగిన ప్రిన్సిపల్ శైలజను తీసుకువచ్చి మా నెత్తిన పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా గురుకుల పాఠశాలలు దరిద్రం, మా చదువులు అధ్వానంగా మారాయి. ఇదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఒక గురుకుల పాఠశాలనే కాకుండా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది.

ఎక్కడ చూసినా పై ఆఫీసర్లను అడగండి అంటూ మాటలు దాటవేస్తూ ఎంఈఓ లు తప్పించుకోవడం మొదలుపెట్టారు ఇప్పటికీ నిజామాబాద్ జిల్లాలో రెండు సంఘటనలు జరిగాయి. వాటిపై తల్లిదండ్రులు కలెక్టర్ కు ఫిర్యాదు ఇచ్చిన అక్కడి నుండి వేరే దగ్గరికి అదే నియోజకవర్గంలో బదిలీ చేయడం తప్ప సస్పెండ్ చేయడం లేదు. ఉపాధ్యాయులను మాత్రం ఏమీ అన్న వద్దన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కానీ బల్లెంల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ శైలజ చేసిన పనికి ఆమెను అక్కడ నుండి గురుకుల పాఠశాలకు ట్రాన్స్ఫర్ చేసి అధికారుల నుండి సపోర్ట్ పొందుతూ మా దగ్గర నుండి పరీక్ష ఫీజులు అంటూ పది వేల రూపాయలు తీసుకొని కిచెన్ లో సామాన్లు కొనుక్కొని ఇంటికి తీసుకు వెళుతుంది.

పిల్లల భవిష్యత్తులు ఉపాధ్యాయుల చేతులలో తల్లిదండ్రులు పెడుతుంటే వారు మాత్రం లక్షలు లక్షలు జీతాలు తీసుకుంటూ వారి జీతాలను వడ్డీలకు తిప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ విద్యార్థులపై కొరడావే వేస్తున్నారు. అలాంటి వారిపై ఐటి దాడులు నిర్వహించకుండా సామాన్య ప్రజల మీద దాడులు చేస్తూ ఉంటారు.
