బోధన్ నవంబర్ 4 ద్రోణ
మాజీ మంత్రి ప్రస్తుత బోధన్ శాసనసభ్యులు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వం ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన సలహాదారులుగా ఆయనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. మంగళవారం బోధన్ పట్టణానికి చెందిన పలువురు పెద్దలు హైదరాబాదులోని పెద్దాయన నివాసంలో కలిసి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. మచ్చలేని, రాజీ పడని నాయకుడిగా, అంకిత భావంతో పనిచేసే వ్యక్తి బోధన్ శాసనసభ్యులుగా ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు బోధన్ పెద్దలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

బోధన్ పట్టణంలో విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యను సైతం శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, లైన్ గవర్నర్ బసవేశ్వర రావు, విద్యా సంస్థల రాష్ట్ర నాయకులు ఇందూరు పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్, విద్యా వికాస్ కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాసరావు, వారితోపాటు పలువురు ఉన్నారు.
