బీడీ కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది

తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (TUCI) రాష్ట్ర నాయకులు.
ఈ ఎస్ ఐ కట్ అవుతున్నటువంటి కార్మికులకు బోధన్ పట్టణంలోనే ఈఎస్ఐ నుండి వైద్య సేవలను
అందించాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (TUCI ) రాష్ట్ర నాయకులు బి. మల్లేష్, డిమాండ్ చేశారు.
బోధన్ టౌన్ ద్రోణ:- మున్సిపల్ కార్యాలయంలో నిజామాబాదు నుండి వచ్చినటువంటి ఈ ఎస్ ఐ మేనేజర్ సురేందర్ గారిని బోధన్ మున్సిపల్ కార్యాలయంలో, సానిటేషన్ ,వాటర్ , ఎలక్ట్రికల్, ట్రాక్టర్ అండ్ ఆటో విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు కార్మికుల ప్రతినిధులతో కలిసి తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (TUCI) ఆధ్వర్యంలో కార్మికులకు ఈ ఎస్ ఐ కి సంబంధించిన వైద్య సేవలను బోధన్ పట్టణంలోనే అందించాలంటూ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (టియుసిఐ) రాష్ట్ర నాయకులు బి మల్లేష్ మాట్లాడుతూ బోధన్ మున్సిపాలిటీలో పనిచేసే 166 మందికి ఈఎస్ఐ కట్ అవుతుందని ఒక్కొక్కరికి ప్రతినెలా వారి వేతనం నుండి వెయ్యి రూపాయల నుండి 1500 రూపాయల వరకు కట్ అవుతున్నప్పటికీ, ఈ కార్మికులకు బోధన్ పట్టణంలో కాకుండా నిజాంబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాదుకు బయట కంటేశ్వరం వద్ద ఆసుపత్రికి వెళ్లి చూయించుకోవాలంటే చూయించుకోలేకపోతున్నారని, అనారోగ్యాలకు గురైనప్పుడు ప్రైవేట్ ఆస్పత్రులలో వారి సొంత డబ్బులు పెట్టుకుని చూయించుకుంటున్నారని ఈ ఎస్ఐ పేరా కట్ అవుతున్న డబ్బులు వృధా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావున కార్మికులకు బోధన్ పట్టణంలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ని ఏర్పాటు చేసి కార్మికులకు వైద్య సేవలను అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సానిటేషన్ జవాన్ గోపి, ఆఫీసు ఉద్యోగి శివ, యం. గంగాధర్, ఎం. లాలయ్య, ఎస్. గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
