Wednesday, February 11, 2026

ములకెత్తిన ధాన్యం

ఎవరు కొనగలరు…?

ఆత్మహత్యలే మాకు శరణం

మమ్మలని ఆదుకునే ప్రభుత్వమే…..?

బోధన్ ద్రోణ:- చందుర్, మోస్రా మండలాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో రైతులు పండించిన వరి ధాన్యం రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ధాన్యాన్ని ఆరబోస్తున్నారు తుఫాను ప్రభావం వల్ల పండించిన ధాన్యం తడిసి ముద్దయిపోయింది. కొన్నిచోట్ల ధాన్యం మొలకలు వచ్చాయి.

ఆ ధాన్యంపై సొసైటీ వారు ఐకెపి వారు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కొనుగోలు చేయడం లేదు మా వడ్లను ఎవరూ కొనకపోతే మా పరిస్థితి ఏమిటి అని మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని పంటలు సాగు చేసి ఉన్నప్పుడే అనేక రోగాలు వచ్చిన అప్పులు చేసి మందులతో పంటను పండించాము. దానితోపాటు వర్షం రావడం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోయి ఓవైపు దిగుబడి లేక అప్పులకు వడ్డీలు పెరిగి ఆత్మహత్యలే శరణమని అనుకోవాలో ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి నష్ట పరిహారం మిచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

అదే పరిస్థితి రెండు మండలాలతో పాటు ఇతర చోట్ల రైతులు మనోవేదన అనుభవిస్తూ పిల్లల స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు కట్టలేదని ఒత్తిళ్లతో రైతులు గందరగోళంలో ఉన్నారు.

కానీ ప్రభుత్వం వీటిని పక్కకు పెట్టి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లలో ప్రచారాలకు దిగి రైతులను పట్టించుకునే నాధుడే కరువయ్యారని రైతుల గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరు మున్నిరై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular