తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు

బోధన్ టౌన్ ద్రోణ:- బాన్సువాడ నియోజకవర్గం లోని కొత్తంగల్ మండల కేంద్రంలో ప్రభుత్వం రైతులకు పండించిన వరి ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ధాన్యం డబ్బుతో పాటు బోనస్ 500 రూపాయలు కలిపి జమ చేయడం.

అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకే సాధ్యం రాష్ట్రంలో సన్న రకం వరి సాగు చేసిన రైతులకు ఉంటాకు 500 చొప్పున బోనస్ చెల్లింపులు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు తెలిపింది. ప్రజా ప్రతినిధులు అధికారులు కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనాలని రైతులు కోరుతు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బస్టాండ్ ప్రాంగణంలో పాలాభిషేకం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, పాలాభిషేకం లో పాల్గొనడం జరిగిందని రైతులందరూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
