Wednesday, February 11, 2026

బ్లాక్ లిస్టు రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు

వర్నిలో వసీ రైస్ మిల్లును సీజ్ చేసిన అధికారులు

బోధన్ ప్రతినిధి నవంబర్ 5 ద్రోణ

గతంలో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లులపై చీఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ఎంతోమంది రైస్ మిల్లర్లు ప్రభుత్వం నుండి ధాన్యాన్ని సేకరించి మాత్రం సరఫరా చేయలేదు. అటువంటి అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టారు. 2023లో పలు రైస్ మిల్లులపై ఫిర్యాదులు అందడంతో అప్పట్లో రైస్ మిల్లులను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి సరైన దాన్నప్పుడు నిల్వలు లేవని నెగ్గు తేల్చారు. అటువంటి అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లులను ఆనాడే బ్లాక్ లిస్టులో ఉంచడం జరిగింది. అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లకు తిరిగి పౌరసరఫరాల శాఖ అధికారులు ధాన్యాన్ని కేటాయించడం పట్ల ప్రత్యేకత తనిఖీలు నిర్వహించారు. బోధన్ ప్రాంతంలోని వర్ని, కోటగిరి మరియు బోధన్ పట్టణంలోని పలు రైస్ మిల్లులను చీఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శశిధర్ రాజు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. సిఎంఆర్ బియ్యం, స్టాక్ రిజిస్టర్ లను క్షుణ్ణంగా అధికారులు పరిశీలించారు. వర్ని మండల కేంద్రంలోని వసీ ఇండస్ట్రీలో 24 బ్యాగుల ఎఫ్ఆర్కే బియ్యం అధికారులు గుర్తించారు. బియ్యం దొరకడంతో అట్టి రైస్ మిల్లు సీజ్ చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular